నాగ్ చైతన్య-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తయారవుతున్న లవ్ స్టోరీ షూటింగ్ చకచకా సాగిపోతోంది. ఇప్పటి దాకా తీసిన రష్ ను ఎడిటర్ గౌతం రాజు ఎడిట్ చేసి ఇవ్వడంతో నాగ్ ప్రత్యేకంగా చూసాడట. చూసి బాగా వచ్చిందని చెప్పడంతో మలి షెడ్యూలు స్టార్ అయిపోతోంది. ఈ మలి షెడ్యూలు విశాఖలో దాదాపు రెండు వారాల పాటు జరుగుతుంది.
ఇదిలా వుంటే ఈ సినిమాలో కూడా విలేజ్ పార్ట్ ఓ అరగంట సేపు వుంటుందని తెలుస్తోంది. అందుకోసం ఎక్కడ షూట్ చేయాలా అన్నది డిస్కషన్ లో వుంది. సోగ్గాడే చిన్ని నాయనా సెంటిమెంట్ ప్రకారం మైసూర్ సమీపంలోని విలేజ్ కు వెళ్లాలా, లేదా ఈస్ట్ గోదావరిలో విలేజ్ సీన్లు తీసి, అన్నపూర్ణలో ఇంటి సెట్ వేసి, ఫినిష్ చేయాలా అన్నది డిస్కషన్ పాయింట్.
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. నిన్నే పెళ్లాడుతా అన్నది కేవలం ఊహాగానం తప్ప మరేం కాదు. ఆ టైటిల్ ను ఫిక్స్ చేసి, అంచనాలు పెంచడమో, లేదా పాడుచేయడమో రెండూ వద్దని నాగ్ క్లియర్ గా చెప్పేసాడట. వేరే టైటిల్ కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆలోచిస్తున్నారు.