Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ సరసన తమన్నా?

నాగ్ సరసన తమన్నా?

సీనియర్ హీరోలకు సమస్య ఏదన్నా వుందీ అంటే అది హీరోయిన్లతోనే. సీనియర్ల పక్కన జోడీ కట్టడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. అయితే ఉన్నంతలో నాగార్జునకు ఈ సమస్య తక్కువ. అందుకే ఆయన సినిమాలకు ఎవరో ఒకరు సెట్ అయిపోతుంటారు.

ప్రస్తుతం నాగ్ ఓ సినిమా ఒకె చేసాడు. రాజుగారి గది 2 అంటూ ఓంకార్ డైరక్షన్ లో మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ వుంది. ఒక హీరోయిన్ గా తమన్నా అయితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారట.

తమన్నా ఇంత వరకు నాగ్ తో నటించలేదు. నాగ చైతన్యతో మాత్రమే చేసింది. అందుకే నాగ్ సరసన తమన్నా ను ఫిక్స్ చేయాలన్న ఆలోచనతో దర్శకుడు ఓంకార్ వున్నట్లు తెలుస్తోంది. తమన్నా ను తెస్తే, సినిమాకు మాంచి బజ్ వస్తుందని, మాంచి గ్లామర్ లుక్ వస్తుందని అనుకుంటున్నారట.  

ఇప్పటికైతే తమన్నాకు తెలుగులో పెద్దగా కమిట్ మెంట్ లు ఏవీ లేవు. అందువల్ల రాజుగారి గది 2 యూనిట్ అడగాలే కానీ నో అని చెప్పకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?