ఈ ఏడాది మొత్తం లేనట్లేనా?

చిన్న హీరోలు ఓకె. పెద్ద హీరోలు ఓకె. కానీ అటు ఇటు కాని మిడిల్ రేంజ్ హీరోలకే వస్తోంది సమస్య. వాళ్ల రెమ్యూనిరేషన్, బడ్జెట్ అన్నీ కలిసి పదిహేను వరకు అవుతున్నాయి. కానీ బాక్సాఫీస్…

చిన్న హీరోలు ఓకె. పెద్ద హీరోలు ఓకె. కానీ అటు ఇటు కాని మిడిల్ రేంజ్ హీరోలకే వస్తోంది సమస్య. వాళ్ల రెమ్యూనిరేషన్, బడ్జెట్ అన్నీ కలిసి పదిహేను వరకు అవుతున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర వాళ్ల సినిమాల రేంజ్ మాత్రం అంత వుండడం లేదు. దాంతో సరైన సినిమాలు పడక, పడినా చకచకా నడవక కిందా మీదా అవుతున్నారు. హీరో గోపీచంద్ పరిస్థితి ఇలాగే వుంది. జిల్ తరువాత పరిస్థితి మరీ నత్త నడకలా వుంది. 

ఎప్పుడో మొదలు పెట్టిన ఆక్సిజన్ అలా పడి వుంది. దాని తరువాత మొదలు పెట్టిన సంపత్ నంది సినిమా మాత్రం కాస్త స్పీడుగానే సాగుతోంది. కానీ ఏం లాభం, 2016 వెళ్లిపోయేలోపు సినిమా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.  అప్పటికే ఎప్పుడో మూలన పడిన ఓ సినిమాను, బి గోపాల్ డైరక్షన్ లో ఫినిష్ చేసే పనిలో పడ్డారు. అదయినా డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ నోట్ల సమస్య వచ్చి, అది కూడా మళ్లీ ఆగింది. 

ఇక ఆక్సిజన్ సమస్యలు దానివి. దాని క్వాలిటీ మీద హీరో అనుమానాలు, రీషూట్ అంటే డైరక్టర్ ఒకె అనకపోవడాలు, ఇలా చాలా అంటే చాలా వున్నాయని వినికిడి.అందుకే సంపత్ నంది సినిమాను చకచకా కానిస్తున్నారు. అయినా కూడా దానికీ డేట్ దొరకడం ఇప్పట్లో సాధ్యం కాదు, ధైర్యం చేస్తే మార్చి నాటికిరావడం లేదా సమ్మర్ ఎండ్ వరకు వెయిట్ చేయడం. ఇదీ గోపీచంద్ సినిమాల పరిస్థితి.