నాగ్ బ్యానర్ లో రాజ్ తరుణ్

ఎప్పుడో ఉయ్యాల జంపాల తరువాత నుంచి కమిట్ మెంట్ వుంది రాజ్ తరుణ్ కు, అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని. అప్పటి నుంచి కుదరడం లేదు. ఆఖరికి ఇప్పుడు ఫైనల్ అయింది.…

ఎప్పుడో ఉయ్యాల జంపాల తరువాత నుంచి కమిట్ మెంట్ వుంది రాజ్ తరుణ్ కు, అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని. అప్పటి నుంచి కుదరడం లేదు. ఆఖరికి ఇప్పుడు ఫైనల్ అయింది. డిసెంబర్ 1న ఆ సినిమా ప్రారంభం కాబోతోంది. ఓ తమిళ మహిళా డైరక్టర్ తొలిసారి తెలుగు తెరకు ఈ సినిమాతో పరిచయం కాబోతోంది. రంజని అనే మహిళా డైరక్టర్ ఈ సినిమాకు దర్శకురాలు. అలాగే హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నారు. 

ఇప్పటికే రాజ్ తరుణ్ రాజుగాడు విడుదలకు సిద్ధమైంది. అంథగాడు సినిమా వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో సగం పూర్తయింది. అన్నపూర్ణ బ్యానర్ సినిమాతో కలిపి మూడు సినిమాలు అన్నమాట. ఇది కాక, ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ లో మారుతి కథతో ఓ సినిమా చేయాల్సి వుంది.