గత ఎన్నికల ముందు వైసీపీని గెలవనీయను అంటూ శపదాలు.. శాసనాలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పి తీరా రెండు చోట్ల నిలబడి ఓడిపోయి మళ్లీ సినిమాల బాట బట్టి ప్రత్యర్థులపై తన సినిమాల్లో సెటైర్లు వేసుకుంటూ అదో రకమైన వింత ఆనందం పొందుతున్నారు.
తన సామాజిక వర్గమైన వ్యక్తి మంత్రిగా ఉన్నారని కోపమో లేక తాను మాట్లాడే ప్రతి మాటకు ఎదురు మాట్లాడతారనో మైక్ కనపడగానే అంబటి రాంబాబుపై సెటైర్లు వేసే పవన్ కళ్యాణ్ తాజాగా తన సినిమాలో కూడా ఆయనపై సెటైర్లు వేస్తూ నీతులు చెప్పారు. తాజాగా పవన్ ఓవరాక్షన్‌పై మంత్రి అంబటి దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి!.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి!' అంటూ ట్వీట్టర్ వేదికగా కౌంటర్ వేశారు.
కాగా గత సంక్రాంతి పండగ సందర్భంగా అంబటి రాంబాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. సరిగ్గా అప్పుడు అంబటి వేసుకున్న డ్రెస్ నే, పవన్ తన సినిమాలో పృధ్వీకి వేయించి.. దాదాపు అలాంటి స్టెప్పుల్నే వేయించారు. దానికి పవన్ నీతులు చెప్పి మురిసిపోయారు. పవన్ కల్యాణ్ ర్యాగింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ జనసైనికులు సంబర పడుతుంటే, రాజకీయాల్లో చేసేదేం లేక, ఇలా సినిమాల్ని అడ్డం పెట్టుకొని పవన్ తృప్తి పొందుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇలా అనవసరంగా అంబటిపై సినిమాల్లో సెటైర్లు పెట్టి పవన్ ఆనందం పొందాలనుకుంటే మంత్రి అంబటి మాత్రం రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌కు కాళరాత్రి అంటూ బాగా బుద్ధి చెప్పారు.