గడచిన రెండేళ్లలో అంధ్రలో అత్యంత హడావుడి నెలకొన్న జిల్లాలు ఏవీ అంటే, కృష్ణ, గుంటూరే. వేలల్లో, లక్ష్లలో వుండే భూముల రేట్లు కోట్లకు ఎగబాకాయి. రాజకీయనాయుకులు భూముల క్రయవిక్రయాలు భయంకరంగా సాగించారు. ఈ క్రమంలో వేల కోట్లు చేతులు మారాయి.
రాష్ట్రంలోని రాజకీయ నాయుకులు, వ్యాపారులు చాలా మంది కృష్ణ, గుంటూరు మీదే పడ్డారు. కోట్లకు కోట్లు బ్లాక్ మనీ చలామణీ అయింది అక్కడే. ఎంత చలామణీ అయిందన్నది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే, గడచిన రెండున్నరేళ్ల కాలంలో అక్కడ జరిగిన రిజస్ట్రేషన్ల వాల్యూ చూస్తే అర్థమైపోతుంది.
అంతకు అంత బ్లాక్ మనీ చలామణీ అయిందని. మరి ఇదంతా ఎక్కడుంది? ఎక్కడకు ఫోయింది? పొలాలకు రేట్లు వచ్చినందుకు సంతోషించిన రైతులు, రియల్ ఏజెంట్ల దగ్గర కూడా ఎంతో కొంత చేరింది. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది..?