టాలీవుడ్ జనాలకు ధర్మవరం, ప్రొద్దుటూరు అంటే టక్కున అర్థమైపోతుంది. ఫైనాన్స్ వ్వవహారం. టాలీవుడ్ లోకి కోట్లకు కోట్లు బ్లాక్ మనీ వచ్చి పడేది అక్కడి నుంచే. మూడు నుంచి పది రూపాయిల వడ్డీకి అప్పులు ఎక్కువగా పుట్టేది ధర్మవరం, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచే, కొంత వరకు విజయవాడ నుంచి.
సాధారణంగా నిర్మాతలు ఏం చేస్తారంటే, వైట్ పేమెంట్ తమ ఖాతాల నుంచి చెల్లిస్తారు. బ్లాక్ పేమెంట్లను ఫైనాన్స్ దగ్గర నుంచి తీసుకుని చెల్లిస్తారు. అంటే బ్లాక్ లో తీసుకుని, బ్లాక్ లో చెల్లిస్తారు. బయ్యర్లు సినిమాలు కొని, ఫైనల్ సెటిల్ మెంట్ లు చేసినపుడు బ్లాక్ లో అమౌంట్లు వస్తాయి. అప్పుడు మళ్లీ ఫైనాన్సియర్లకు బ్లాక్ లో చెల్లింపులు చేస్తారు. సో అందువల్ల నిర్మాతల దగ్గర పెద్దగా బ్లాక్ మనీ వుండదు. అన్నీ బ్యాంక్ గ్యారంటీలు, లోన్లు, ఇలాంటివే. మహా వుంటే లక్షల్లో వుంటుంది.
కానీ ఈ ఫైనాన్షియర్ల వ్యవహారం అలా కాదు. ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుందో అని కోట్లలో సొమ్ము స్టాక్ పెట్టుకుని వుంటారు. ఇప్పుడు వారికి ఇలాంటి అలాంటి ఝలక్ కాదు ఈ నోట్ల రద్దు అన్నది. ఇండస్ట్రీ మొత్తం కిందా మీదా అయిపోతోంది. జనాల మీద వున్న డబ్బు సంగతి ఒకె. కానీ ఇళ్లలో వుండిపోయినది ఏం చేయాలో? ఏం చేస్తారో?