నిఖిల్ సినిమాకు ఫైనాన్స్ సమస్య?

అదేంటో పాపం, నిఖిల్ సినిమాలకు ఫైనాన్స్ సమస్యలు అన్నవి కామన్ అయిపోతున్నాయి. మంచి సినిమాలు ఎంచుకు మరీ చేస్తున్నాడు కానీ, ఫైనాన్స్ సమస్యలు తప్పడం లేదు. Advertisement కార్తికేయ దగ్గర ప్రారంభమైన ఈ సమస్య…

అదేంటో పాపం, నిఖిల్ సినిమాలకు ఫైనాన్స్ సమస్యలు అన్నవి కామన్ అయిపోతున్నాయి. మంచి సినిమాలు ఎంచుకు మరీ చేస్తున్నాడు కానీ, ఫైనాన్స్ సమస్యలు తప్పడం లేదు.

కార్తికేయ దగ్గర ప్రారంభమైన ఈ సమస్య దాదాపు అన్ని సినిమాలకు చుట్టుముడుతోంది. సూర్య వెర్సస్ సూర్య, శంకరాభరణం విషయం ఓకె కానీ, ఆ తరువాత చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా కు అదే సమస్య.

సినిమా ప్రారంభమైన తరువాత  నత్తనడక నడించింది. ఆఖరికి పూర్తయి విడుదలకు సిద్ధమైంది. పబ్లిసిటీకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే విషయం మీడియా వెల్లడిస్తే, హాత్తెరి..పబ్లిసిటీ లేదంటారా? అలా రాసేవాళ్లపై కోర్టులో కేసు వేస్తాం అని కూడా కామెంట్ చేస్తున్నారట యూనిట్ జనాలు. సరే, పబ్లిసిటీ వుంటేనేం..లేకుంటేనేం, సినిమా విడుదల అయితే పక్కా అయింది. సినిమా బాగా వచ్చిందని టాక్ అయితే వుంది. అదే ఆ సినిమాకు రక్ష.

కానీ తరువాతి సినిమాకు ఆదిలోనే ఫైనాన్స్ సమస్య వచ్చిపడినట్లు తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్ ఆధ్వర్యంలో దోచేయ్ లాంటి డిజాస్టర్ తరువాత సుధీర్ వర్మ చేసే సినిమాలో హీరో నిఖిల్ నే. ఈ సినిమా స్టార్ట్ అయింది. ఓ షెడ్యూలు షూట్ కూడా జరిగింది. అయితే అభిషేక్ పిక్చర్స్ సంస్థ ట్రబుల్స్ లో పడడంతో ఈ సినిమాకు ఇప్పుడు ఫైనాన్షియర్ ను వెదుకుతున్నారట. ఫైనాన్స్ దొరికాకే తరువాతి షెడ్యూలు వుంటుందని తెలుస్తోంది. పాపం, ఏమిటో నిఖిల్ కు ఈ సమస్య.