సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొస్తే, ఎఫైర్స్ గురించి ఎందుకు ప్రశ్నిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. సినిమా కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తుంటే, మీడియా తమను ఇంతలా చిన్న చూపు చూడటం తగదని శ్రద్ధా కపూర్ వాపోయింది. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ రంగంలోకొచ్చిన శ్రద్ధా కపూర్, తక్కువ సినిమాలతోనే అయినా బాలీవుడ్ తెరపై మంచి ఇంప్రెషనే వేసింది.
హీరోయిన్‌గానే కాకుండా, సింగర్‌గా కూడా తనలో టాలెంట్‌ని ప్రదర్శిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతానికైతే తన సినిమాలకే తాను పాటలు పాడుకుంటాననీ, భవిష్యత్ సంగతి చెప్పలేనని శ్రద్ధా కపూర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. సినిమాల్లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించాలంటే కో-స్టార్స్‌తో టెంపరరీ ఎఫైర్ తప్పదా.? అని ఎవరో తనను ప్రశ్నించారట. దాంతో, శ్రద్ధా కపూర్‌కి ఒళ్ళు మండిపోయిందట.
'బీచ్‌లో బికినీతో షూట్ జరుగుతుంటుంది.. ఆ సమయంలో మేం ఎంత డిస్కంఫర్ట్ ఫీలవుతామో తెలుసా.? మండుటెండల్లో అలాంటి సీన్స్ షూట్ చేసేటప్పుడు ప్రత్యక్ష నరకమే.. ప్రేక్షకులు మా గ్లామర్‌నే చూస్తారు.. దాని కోసం మేం ఎన్నెన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది..' అంటూ సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్. ఎఫైర్స్ పేరుతో వచ్చే గాసిప్స్‌ని బాలీవుడ్ హీరోయిన్లు ఎంజాయ్ చేయడం మామూలే. శ్రద్ధా కపూర్ మాత్రం, కాస్త డిఫరెంట్‌గా స్పందించిందడోయ్.