Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్లాసీ ఫన్ కు కూడా యు/ఎ నా?

క్లాసీ ఫన్ కు కూడా యు/ఎ నా?

జంధ్యాల కాలం నాటి నేటివ్ కామెడీ స్టయిల్ లో మంచి సినిమా అందిస్తున్నాం అన్నారు జయమ్ము నిశ్చయమ్మురా సినిమా గురించి దర్శకుడు, హీరో కూడా. సినిమా టీజర్లు, సాంగ్ ప్రోమోలు కూడా ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్కాల్ ఏజెంట్ టైపులో ప్రవీణ్ కానీ, శాంపిల్ చూస్తారేటి అంటూ కృష్ణభగవాన్ కానీ నేటివ్ కామెడీనే పండించినట్లు కనిపిస్తోంది. కానీ చిత్రంగా సినిమాకు సెన్సార్ పూర్తయ్యాక యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఎందుకు అని ఆరా తీస్తే, కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే వుందని తెలుస్తోంది.

సినిమాలో కృష్ణ భగవాన్ ఆపీస్ సూపరింటెండెంట్ గా పనిచేసే క్యారెక్టర్ ను పోషిస్తాడు. ఆ పాత్ర, తన కొలీగ్ కు లైన్ వేసే వ్యవహారం వుంటుంది. దాంతో ఆ కొలీగ్ కృష్ణ భగవాన్ కు పడిపోతుంది. ఈ క్రమంలో ఒకటి రెండు మాంచి రంజైన సీన్లు వున్నాయని వినికిడి. ఆ కొలీగ్ పాత్రను పాపులర్ టీవీ సీరియల్ నటి ఒకరు పోషించినట్లు తెలుస్తోంది. మొత్తానికి 24న వస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా లో నేటివ్ కామెడీనే కాదు, నేటివ్ సరసాలు కూడా వున్నట్లున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?