బాలీవుడ్ టాపర్స్ ఎందుకు నో చెబుతున్నారు?

మొదట్నీంచీ టాలీవుడ్ టాప్ హీరోలకు ఓ తీరని కోరిక వుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లను తమ పక్కన నటింపచేయాలన్నది ఆ కోరిక. కానీ అది మాత్రం తీరడం లేదు. ఐశ్యర్యరాయ్, దీపికా పడుకొనే, పరిణీతీ…

మొదట్నీంచీ టాలీవుడ్ టాప్ హీరోలకు ఓ తీరని కోరిక వుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లను తమ పక్కన నటింపచేయాలన్నది ఆ కోరిక. కానీ అది మాత్రం తీరడం లేదు. ఐశ్యర్యరాయ్, దీపికా పడుకొనే, పరిణీతీ చోప్రా, సోనాక్షి సిన్హా, ఇలా చాలా మంది పేర్లు చాలా సార్లు వినిపించాయి. కానీ ఏనాడు ప్రాజెక్టులు మాత్రం సెట్ కాలేదు. పైగా చాలా మంది బాలీవుడ్ టాప్ హీరోయిన్లు తమిళ సినిమాలకు మొగ్గు చూపారు. 

ఇది మన హీరోలకు పాపం మరింత డిస్సపాయింట్ మెంట్ అనే చెప్పాలి.  ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. మీనాక్షి శేషాద్రి లాంటి వాళ్లు తెలుగులో కూడా నటించారు. కానీ ఇప్పటి జనరేషన్ బాలీవుడ్ టాప్ హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ అంటే పెద్దగా సెట్ కావడం లేదు. దీనికి రెండు కారణాలు ఒకటి రెమ్యూనిరేషన్. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల రెమ్యూనిరేషన్ మూడు కోట్లకు పైమాటే. మన దగ్గర టాప్ హీరోయిన్ రెమ్యూనిరేషన్ మహా అయితే కోటి, కోటిన్నరే.

మహేష్ సరసన పరిణీతి చోప్రాను నటింపచేయాలని మురుగదాస్ సినిమా కోసం ట్రయ్ చేసారు. కానీ ఆఖరికి రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర సెటిల్ అయ్యారు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంపత్ నంది డైరక్టర్ గా వున్నపుడు సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా చేద్దామని చూసారు. కానీ కుదరలేదు.

చిరంజీవి 150 వ సినిమాకు కూడా బాలీవుడ్ హీరోయిన్ కోసం ప్రయత్నించారు. కానీ ఎక్కడ లేని రేట్లు డిమాండ్ చేయడంతో వదిలేసారు.

ప్రభాస్ సరసన దీపికా పడుకొనే అన్న పేరు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అది కూడా మెటీరియలైజ్ అయ్యే వరకు నమ్ముకోవడానికి లేదు.

ఇలా పెద్ద హీరోల కొత్త సినిమాలు తెరపైకి వచ్చిన ప్రతిసారీ బాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఎంతకూ మెటీరియలైజ్ కావు. ఆఖరికి లోకల్ టాలెంట్ తో సరిపెట్టుకుంటూ వుంటారు. అందువల్ల మన సమంత, రకుల్ లాంటి వాళ్లు ఒక్కో హీరోతో ఒకటి కి రెండు సార్లు జోడీగా సినిమాలు చేయగలుగుతున్నారు. తాజాగా పవన్-త్రివిక్రమ్, కొరటాల శివ-మహేష్, సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమాలకు హీరోయిన్ల వేట మొదలైంది. మళ్లీ బాలీవుడ్ పేర్లు వినిపించడం ప్రారంభమైంది. ఇవి ఏమైనా నిజం అవుతాయేమో చూడాలి.