చూసే కళ్లలో దోషం లేకపోతే.. ఆ ముద్దులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం మాత్రమే ఉన్నాయి. కానీ ఇది పాడు సమాజం కదా! ఇప్పటికే ఐష్ తెరపై పండించిన రొమాన్స్ తోనే సగం సమాజం బుగ్గలు నొక్కుకుంటోంది! అలాంటి సమాజం కళ్లలో మరో సెల్ఫీ పడింది! ఇది చూసిన తర్వాత అతడెవరు? అనేదే మొదటి ప్రశ్న!
ఇతడు సికిందర్ ఖేర్ అని… బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తనయుడు. అనునిత్యం నీతులు, విలువలు బోధించే అనుపమ్ ఖేర్ కు స్టెప్ సన్. సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి.. ఐష్ కు వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్. ఇటీవల ఐష్ పుట్టిన రోజు సందర్భంగా అతడు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ముద్దు ద్వారా అతడు ఆమెపై తన ఆప్యాయతను వ్యక్తీకరించాడు.
అదే సమయంలో సెల్ఫీ కూడా క్లిక్ మనిపించాడు. సోషల్ మీడియాలో ఈ సెల్పీ రొటేట్ అవుతోంది. దీన్ని షేర్ చేస్తూ.. బుగ్గలు నొక్కుకొంటున్న వాళ్లే ఎక్కువ!