సరైన వార్తలు లేక డల్ గా వున్న మీడియా సంస్థలకు కడుపునిండా ఫుడ్ పెట్టేసింది కమల్ – గౌతమి ల బ్రేకప్ న్యూస్. పైగా గౌతమినే సుదీర్ఘ ప్రకటన ఎమోషనల్ ప్రకటన విడుదల చేయడం అన్నది మరీ ఊతం ఇచ్చింది. పెళ్లి అన్నది లేకుండానే 13 ఏళ్ల కాలంగా కలిసి వున్న గౌతమి-కమల్ ల బంధం ఇప్పుడు ఇలా ఎందుకు వత్తిడికి గురయిందన్నది ప్రశ్న. పైగా కమల్ కు గౌతమి అంటే ఎంతో అభిమానం అన్నది అందరికీ తెలుసు. గౌతమిని ఎంత ఆదుకున్నాడో తెలుసు.
ఇప్పుడు కూడా గౌతమి తనకు కమల్ అంటే పిచ్చి అభిమానమనే అంటోంది. మరి ఎందుకు ఇంత ఎమోషనల్ అయి, విడిపోవాల్సి వచ్చినట్లు? వెంటనే మీడియాలో వినిపిస్తున్న పేరు శృతి హాసన్. తండ్రి కమల్ తో కుమార్తె శృతి ఒకటయ్యారని, పైగా శృతి తన తల్లికి సవతి అయిన గౌతమి అంటే కాస్త చిన్న చూపుతో వుందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల శృతి-కమల్ నటిస్తున్న సినిమాలో కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమిని శృతి అవమానించిందని అంటున్నారు. అయినా ఈ విషయంలో కమల్ మౌనం వహించడం గౌతమిని బాధించిందట. ఎంతయినా శృతితో కమల్ ది రక్త సంబంధం. కన్న కూతురు. గౌతమితో పెంచుకున్న బంధం. గౌతమికి కూతురు వున్నా ఆమె కమల్ కు ఏమీ కాదు. సారిక దూరమైనా శృతి కమల్ తోనే వుంది.
గౌతమి మీద ఎంత ప్రేమ వున్నా శృతిని ఎందుకు కమల్ కాదనుకుంటాడు? ఇలాంటివి చాలా డెలికసీ పాయింట్లు. తమ మధ్య వున్న అడ్జస్ట్ మెంట్ బంధాన్ని గౌతమే కాస్త ఎక్కువ అంచనా వేసుకుందేమో? కమల్ ను తనా? నేనా? అనే పరిస్థితిలోకి నెడితే వచ్చిన పరిస్థితి ఇది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి కమల్ కు పెళ్లిళ్లు కానీ బంధాలు కానీ అచ్చిరావేమో? వాణి, సారిక, గౌతమి..మూడు బంధాలు ఇలా బ్రేకప్ తో ముగిసాయి. వాణి కమల్ ను విమర్శించింది. సారిక మౌనం వహించింది. గౌతమి భావోద్వేగ ప్రకటన చేసి తప్పుకుంది. అంతే తేడా.