రేపే ఇటు నందమూరి, అటు మెగాభిమానులకు దీపావళి. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 కి సంబంధించి లేటెస్ట్ లుక్, ఇటు బాలయ్య వందో సినిమా శాతకర్ణి లేటెస్ట్ స్టిల్, ఈ రెండూ రేపే అరగంట తేడాలో విడుదలవుతున్నాయి. ఈ రెండూ ఎలా వుంటాయి అన్న కుతూహలం ఆయా హీరోల అభిమానుల్లో వుంది.
చిరంజీవి సినిమాకు సంబంధించి ఓ డ్యాన్స్ మూవ్ మెంట్ ను లేటెస్ట్ స్టిల్ గా వదులుతున్నట్లు తెలుస్తోంది. లారెన్స్ డ్యాన్స్ డైరక్షన్ లో పాట చిత్రీకరణ చేసారు. అందులోని ఓ డిఫరెంట్ డ్యాన్స్ మూవ్ మెంట్ ను లేటెస్ట్ లుక్ గా వదుల్తారని టాక్ వినిపిస్తోంది.
ఇక శాతకర్ణి సినిమాకు సంబంధించి రెండు స్టిల్స్ ఫైనల్ చేసారట. అందులో ఒకటి గుర్రం రెండు కాళ్లు పైకి లేపి వుంటే, దానిపై బాలయ్య కూర్చున్న స్టిల్. రెండవది బాలయ్య కత్తి పట్టుకున్న ఫుల్ సైజ్ స్టిల్. పారామౌంట్ స్టిల్ అనే పేరుతో ఈ లేటెస్ట్ లుక్ ను వదుల్తారని వినికిడి.
రేపు మద్యాహ్నం రెండు, రెండున్నర గంటల సమయంలో రెండు స్టిల్స్ బయటకు వస్తాయి. అప్పటి దాకా అభిమానులు ఇలాంటి ..ట..వార్తలతో ఎదురు చూడాల్సిందే.