బ్రహ్మోత్సవం దెబ్బ అంత గట్టిగా తగిలిందా?

నైజాం లో సర్రున దూసుకుపోతున్న అభిషేక్ పిక్చర్స్ పరిస్థితి డోలాయమానంలో పడిందని తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. అబ్బే లేదని, ఇదంతా బెల్లంకొండ సురేష్ సినిమా వదిలేయడం వల్ల చేసిన నెగిటివ్ పబ్లిసిటీ తప్ప వేరు…

నైజాం లో సర్రున దూసుకుపోతున్న అభిషేక్ పిక్చర్స్ పరిస్థితి డోలాయమానంలో పడిందని తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. అబ్బే లేదని, ఇదంతా బెల్లంకొండ సురేష్ సినిమా వదిలేయడం వల్ల చేసిన నెగిటివ్ పబ్లిసిటీ తప్ప వేరు కాదని అభిషేక్ సన్నిహిత వర్గాల బోగట్టా. అయితే అంత లేదు కానీ, కొంత వరకు అయితే అభిషేక్ పిక్చర్స్ కాస్త షేక్ అయిందని టాక్ వినిపిస్తోంది. 

పార్టనర్లు విడిపోవడం ఓ కీలక పరిణామం అని ఓ టాక్. దానివల్లే కాస్త ఒడిదుడుకులు వచ్చాయంటున్నారు. ఇదిలా వుంటే బ్రహ్మోత్సవం సినిమాలో అభిషేక్ పిక్చర్స్ కు పది కోట్ల వరకు నష్టం వచ్చిందని, అదే కాస్త గట్టి దెబ్బ తగిలించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కాక గతంలో పేరుకు ఇద్దరు పార్టనర్లే కానీ, తెరవెనుక పెద్దలు చాలా మంది తలా చేయి వేసి సాయం చేసారట. 

ఇప్పుడు వారంతా తప్పుకోవడంతో కూడా టర్నోవర్ కాస్త ఇబ్బంది గా వుందని అంతే, తప్ప తలుపులు మూసేటంత కాదని అంటున్నారు. సుధీర్ వర్మతో చేస్తున్న సినిమా స్మూత్ గా సాగుతోందని, అలాగే అనుకున్న మిగిలిన ప్రాజెక్టులు కూడా ఏవీ ఆగలేదని అంటున్నారు. ఏమయినా బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే వున్నట్లుంది.