అయినా…అతను మారలేదు

సినిమా రంగంలో మాటలు భలేగా వుంటాయి.  ‘ అబ్బ డైరక్టర్ తెగ ఇబ్బంది పెడుతున్నాడండీ..అన్నీ నన్ను కూడా చూడమంటాడు. నాకెందుకు అన్నా వినడం లేదండీ..అన్నీ దగ్గరుండి చూసుకొవాల్సి వస్తోంది అంటాడు హీరో. ఏం చెప్పమంటారండీ…

సినిమా రంగంలో మాటలు భలేగా వుంటాయి.  ‘ అబ్బ డైరక్టర్ తెగ ఇబ్బంది పెడుతున్నాడండీ..అన్నీ నన్ను కూడా చూడమంటాడు. నాకెందుకు అన్నా వినడం లేదండీ..అన్నీ దగ్గరుండి చూసుకొవాల్సి వస్తోంది అంటాడు హీరో. ఏం చెప్పమంటారండీ బాబు అన్నింటిలో ఆయనే వేలు పెట్టేస్తున్నాడు అంటాడు హీరో పరోక్షంలో డైరక్టర్. అన్నీ తనకు తెలుసు అనుకునే హీరోలయితే ఈ సమస్య మరీనూ. 

టాలీవుడ్ లో కింద నుంచి పైకి ఎదిగిన మిడిల్ ఏజ్డ్ మిడిల్ రేంజ్ హీరోతో అదే సమస్య అంట. సరైన హిట్ పడకుండా కిందా మీదా అవుతున్నా కూడా చేతిలో వున్న ఒక్క సినిమా విషయంలోనూ ఆ హీరో దూరిపోతున్నాడట. ఈ మధ్య ఓ ఏవరేజ్ హిట్, ఓ ఫట్ వచ్చాయి. ఆ ఏవరేజ్ హిట్ రావడానికి కారణం, తను అన్నీ దగ్గర వుండి చూసుకోవడమే అని సదరు హీరోకి నమ్మకం అంట. 

దాంతో ఈసారి చేతిలో మిగిలిన ఒక్క సినిమా విషయంలో అదే పని మొదలుపెట్టారట. డైరక్టర్ ఏమో మాంచి మెలోడియస్ గా పాటలు చేయిస్తే, అబ్బే అది కాదు, మాంచి బీటు కావాలి అంటూ మళ్లీ మార్పిస్తున్నాడట. దాంతో మాంచి అద్భుతమైన సినిమా ఇచ్చి, ఇప్పుడు ఈ హీరోతో సినిమా చేస్తున్న సదరు డైరక్టర్ సన్నిహితుల దగ్గర ఈ విషయం చెప్పుకుని బాధపడుతున్నాడట. 

ఓ ఫ్లాప్ తరువాత ఏవరేజ్ హిట్ వచ్చింది. ఆపై డిజాస్టర్ పలకరించింది. అలాంటపుడయినా డైరక్టర్ల మీద భరోసా పెట్టి, స్క్రిప్ట్ సరిగ్గా వుందో లేదో చూసుకుని, ప్రేక్షకులు తనకేం కావాలనుకుంటున్నారో గమనించుకుని ఆ విధంగా ముందుకు వెళ్లాలి కానీ, దర్శకుడిని ముందు పెట్టి తను బ్యాక్ సీట్ డ్రయివింగ్ చేస్తే, చేతిలో వున్న సినిమా అయిపోయిన తరువాత మళ్లీ సినిమా రావడం కష్టమవుతుందని ఆ హీరోకి ఎవరు చెబుతారో?