ఇంతకీ జయా బచ్చన్ పంచుకున్న ఆవేదన వెనుక అసలు కారణం ఏమిటి? ఇండియన్ సినిమాలో భారతీయత ప్రశ్నార్థకంగా మారిపోయింది.. అని ముంబై మూవీ అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్(మామి) ఉత్సవాల్లో జయ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం వెనుక అసలు కారణం ఏమిటి? హీరోయిన్లు అందాల ప్రదర్శనకు, శృంగార సన్నివేశాల్లో నటించడానికి పరిమితం అవుతున్నారు.. వీరి పాత్రల్లో అస్సలు భారతీయత ఉందా? అని జయబచ్చన్ ఆవేదనభరితురాలు కావడానికి వెనుక రీజన్ ఏమిటి? అంటే.. కోడలు ఐశ్వర్య పేరే వినిపిస్తోందిప్పుడు!
ఒకవైపు దేశమంతా ‘ యే దిల్ హే ముష్కిల్’ సినిమాలో ఐశ్వర్య ఎంత హాట్ గా కనిపిస్తోంది.. రణ్ భీర్ తో ఆమె నటించిన శృంగార సన్నివేశాలు ఎలా ఉంటాయి.. అని చర్చించుకుంటున్న సమయంలో.. ఈ వారంలో ఆ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇందులో ఐష్ హాట్ కనిపిస్తున్న ఆశావహులు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుంటున్న తరుణంలో.. జయ బచ్చన్ బాలీవుడ్ సినిమాల్లో చనిపోతున్న భారతీయత గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఆమె ‘భారతీయత’ అని అనడం కూడా కోడలి తీరుపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వివాహ, ప్రసవం అనంతరం కోడలు సినిమాల్లో నటించడం పట్ల బచ్చన్ ఫ్యామిలీకి అసంతృప్తి ఏమీ లేదు. అయితే ఐష్ రొమాంటిక్ ఎంటర్ టైనర్లలో నటించడం పట్ల మాత్రం బచ్చన్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఇప్పటికే స్పష్టం అయ్యింది. మామూలుగా ఐష్ సినిమా ప్రమోషన్ కు కలిసి వచ్చే అమితాబ్ ‘యే దిల్ హే ముష్కిల్’ ప్రచారాన్ని పట్టించుకోలేదు.. ఆ సినిమాలో కొన్ని సీన్లను ఎడిట్ చేయించాలని కూడా ఆయన ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. ఇక అభిషేక్ అయితే.. ఇప్పటి వరకూ ఐష్ తాజా సినిమా పట్ల పెదవి విప్పలేదు!
ఈ నేపథ్యంలో.. జయ బచ్చన్ ఏకంగా సినీ ఇండస్ట్రీ పోకడల మీదే నిప్పులు చెరిగారు. ఇలాంటి ఇండస్ట్రీలో తను ఉండలేనని కూడా ఆమె అనడం విశేషం! మరి ఇదంతా కోడలి తీరుపై కలిగిన మనస్తాపమేనా?