పూరీ సినిమాపై ట్రిక్స్ ప్లే చేస్తున్నారా..!

ఇదంతా మామూలే.. ‘మా సినిమాను రీమేక్ చేస్తామంటూ.. తమిళ నిర్మాతల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి..’ ‘ఈ సినిమాను రీమేక్ చేయడానికి పక్కభాషల వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.. ‘రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఉంది..’…

ఇదంతా మామూలే.. ‘మా సినిమాను రీమేక్ చేస్తామంటూ.. తమిళ నిర్మాతల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి..’ ‘ఈ సినిమాను రీమేక్ చేయడానికి పక్కభాషల వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.. ‘రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఉంది..’  ఇలాంటి మాటలు పరమ రొటీన్ అయిపోయాయి ఈ మధ్య! సినిమా విడుదల అయ్యాకా.. ప్రమోషన్ కోసం మాటలను వాడేస్తున్నారు వాటి రూపకర్తలు!

తమ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని.. ఎంతలా అంటే, పక్కభాషల వాళ్లు దీన్ని రీమేక్ చేయడంపై ఆసక్తి చూపడం వరకూ వెళ్లిందని చెప్పుకోవడం ద్వారా జనాలను థియేటర్లకు రప్పించాలనేది వీరి ప్రయత్నం. ఇందుకోసం వీళ్లు ఇతర భాషల సినీ ప్రముఖుల పేర్లనూ బాగానే వాడేసుకుంటున్నారు. 

అది కూడా వీళ్లు.. ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసే హీరోల పేర్లనే వాడుతూ ఉంటారు. తమ సినిమాను రీమేక్ చేయడానికి పక్క భాషలోని ఆ స్టార్లు ఉత్సాహం చూపిస్తున్నారని అంటుంటారు. మరి ఇప్పుడు ‘ఇజం’ సినిమా రీమేక్.. అనే మాట వినిపిస్తుండటంతో.. ఇది కూడా ఆ తరహా ట్రిక్కేమో అనే అభిప్రాయం కలుగుతోంది.

ఈ సినిమా ను పూరీ హిందీలో రీమేక్ చేయానున్నాడని.. సల్మాన్ హీరో అని.. కొశ్చన్ మార్కులతో కూడిన కథనాలు మీడియాలో వస్తున్నాయి. పూరీ అధికారికంగా ప్రకటించినట్టుగానూ లేదు.. సల్మాన్ ఖాన్ ధ్రువీకరించినట్టుగా లేదూ.. ఊరికే ‘ఇజం’ సినిమాను వార్తల్లో నిలపడానికి ఇదో ప్రయత్నం కావొచ్చు! ఈ సినిమాలో.. సల్మాన్ రీమేక్ చేసేంతటి విషయం ఉందా? అని కొంతమంది ప్రేక్షకులు అయినా.. థియేటర్ల బాట పట్టకపోరా అనేది ఇలాంటి వార్తల వ్యూహంగా మారింది ఈ రోజుల్లో!