Advertisement

Advertisement


Home > Movies - Movie News

భలే 'తేడాగా' ఉన్నాడే..!

భలే 'తేడాగా' ఉన్నాడే..!

రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ లోనే మీసాల్లేకుండా కనిపించేసరికి ఇదేదో తేడాగా ఉందే అనుకున్నాం. ఇప్పుడదే నిజమైంది. 'భలే ఉన్నాడే' సినిమా టీజర్ తో రాజ్ తరుణ్ పాత్ర ఏంటి, ఎలా ఉండబోతోందనే విషయాన్ని విపులంగా చెప్పేశారు. టీజర్ అంతా చూసిన తర్వాత ఎవరికైనా కలిగే ఫీలింగ్... భలే 'తేడాగా' ఉన్నాడే..!

సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర పేరు రాధ. ఫంక్షన్లలో ఆడాళ్లకు చీరలు కట్టడం, రంగురంగుల ముగ్గులు వేయడం ఇతడి వృత్తి. పొద్దున్న లేస్తే లేడీస్ పక్కనే ఉంటాడు. కానీ ఆడది అంటే చాలు ఆమడ దూరం పారిపోతాడు.

ఓవైపు హీరో ఇలా ఉంటే, హీరోయిన్ పూర్తి రివర్స్. మంచం ఎక్కితే మినిమం ముగ్గురు పిల్లల్ని చేతిలో పెట్టేంత ఫాస్ట్ గా కాబోయే భర్త ఉండాలనేది ఈమె కోరిక. అటు హీరో మాత్రం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాడు. వీళ్లిద్దరికీ ఎలా సింక్ అయిందనేది ఈ సినిమా.

దర్శకుడు శివసాయి వర్థన్ మంచి పాయింట్ ఎత్తుకున్నాడు. రాజ్ తరుణ్ కూడా ఆ పాత్రకు 'భలే' సెట్ అయ్యాడు. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. టీజర్ కు మంచి స్కోర్ ఇచ్చాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?