Advertisement

Advertisement


Home > Politics - Andhra

అన్నం తినే వారు రాసే రాతలేనా ఇవి?

అన్నం తినే వారు రాసే రాతలేనా ఇవి?

వైసీపీ మీద విషయం చిమ్ముతూ టీడీపీకి మేలు చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా నిత్యం తన పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరు అని ఆయన ప్రశ్నించారు.  అన్నం తినేవాళ్ళు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు రాయరు అని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే, ఇలాంటి తప్పుడు కూతలు రాతలు అని బొత్స విమర్శించారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై మీకు అసలు అవగాహన ఉందా అని టీడీపీ అనుకూల మీడియా మీద ఫైర్ అయ్యారు. మా భూమి మాది కాక పోతే ఎవరిది అని ఆయన నిలదీశారు.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై  పచ్చ మీడియాకు ఎందుకు కడుపు మంటో అర్థం కావడం లేదని అన్నారు.

మరొక పేపర్లో, నేల చట్టంలో నింగీ గాలి అంటూ రాతలు రాశారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాతలూ కూతలు అన్నీ కూడా పోలింగ్‌ జరిగే వరకే. ఆ మర్నాడు వాళ్లు ఈ వార్తలు రాస్తే అడగండి అప్పుడు వీళ్లకు ఏ రకమైన సామాజిక బాధ్యత ఉండదని బొత్స అన్నారు.

దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ ఫ్రెండ్స్‌గా ఉన్న కూటమికి లాభం చేకూర్చాలన్నదే ఎల్లో మీడియా తాపత్రయం అని ఆయన విమర్శించారు. అయినా ప్రజలేమన్నా అమాయకులనుకుంటున్నారా మీ మాట ఎవరు నమ్ముతారు అని ఆయన ప్రశ్నించారు.

మీరంత చేసే ప్రచారం, వాస్తవాలకు ఇంత దూరంగా ఉంటే ఇక ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమే అవుతుంది అని గట్టిగానే కోటింగ్ ఇచ్చేశారు. దళారులు లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా పూర్తి హక్కులు కల్పించే చట్టంగా తీసుకుని రావాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు.  ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుందని బొత్స చెప్పారు.

అవినీతికి తావులేకుండా దళారులు, లిటిగెంట్లకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండాలని మేం ఈ చట్టం తెస్తున్నామని అన్నారు. ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని ఆయన అంటూ అందులో భాగంగానే ఇది జరుగుతోంది. ప్రస్తుతం కోర్టుల్లో ఉంది. పబ్లిక్‌ హియరింగ్‌ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు అని బొత్స స్పష్టం చేశారు.

ఈ లోపు మీటింగులు పెట్టి ఒకరు జోగిపోతూ ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారని చంద్రబాబు పవన్ మీద బొత్స విమర్శలు సంధించారు. పవన్‌ కల్యాణ్‌ పెద్ద మేధావా అని బొత్స ప్రశ్నించారు. అసలు పవన్‌ కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాని మండిపడ్డారు. ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్‌ కాపీలు ఇస్తారా అని నిగ్గదీశారు. పవన్‌ కల్యాణ్‌ మాటలకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదని బొత్స అన్నారు.  చంద్రబాబు ఎన్నికల్లో లబ్ది కోసమే ఏదో జరిగిపోతోందని హడావుడి చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?