Advertisement

Advertisement


Home > Politics - Andhra

ల్యాండ్ టైటిల్ చ‌ట్టం... టీడీపీ దొరికిందేంది సామి!

ల్యాండ్ టైటిల్ చ‌ట్టం... టీడీపీ దొరికిందేంది సామి!

ల్యాండ్ టైటిల్ చ‌ట్టంపై టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. టీడీపీ చిల్ల‌ర చేష్ట‌ల్ని అస‌హ్యించుకునేలా ఆ పార్టీ ద్వంద్వ వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం వెలుగులోకి వ‌చ్చింది. వ‌లంటీర్ల ద్వారా సామాజిక పింఛ‌న్లు పంపిణీ చేయ‌కూడ‌ద‌నే ఫిర్యాదు , అనంత‌ర దుష్ప్ర‌రిణామాల గురించి అంద‌రికీ తెలిసిన‌వే. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ త‌న ఫిర్యాదులో చాలా స్ప‌ష్టంగా సామాజిక పింఛ‌న్‌దారుల‌కు బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ ద్వారా సొమ్ము జ‌మ చేయాల‌ని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇదే విష‌యాన్ని చెప్పారు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ విష‌యాన్ని మ‌రిచిపోక‌నే... ఎల్లో మీడియా, టీడీపీ రాద్ధాంతం చేస్తున్న ల్యాండ్ టైటిల్ చ‌ట్టంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశవ్ అసెంబ్లీలో మ‌ద్ద‌తు ఇస్తూ చేసిన ప్ర‌సంగం బ‌య‌టికొచ్చింది. 2019లోనే ఈ బిల్లును అసెంబ్లీలో స‌మ‌ర్థిస్తూ ప‌య్యావుల వివ‌రంగా మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే...

"ఈ బిల్లును త‌ప్ప‌కుండా మేము ఆమోదిస్తున్నాం. ఈ ప‌రిస్థితుల్లో బిల్లు రావాల్సిన అవ‌స‌రం వుంద‌ని భార‌తదేశ ప్ర‌భుత్వం కూడా గుర్తించింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ బిల్లును అమ‌లు చేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం కోరింది. క‌ర్నాట‌క‌లో భూమి పేరుతో ఈ చ‌ట్టం అమ‌లవుతోంది. మంత్రిగారు మాట్లాడుతూ ఇట్లాంటి చ‌ట్టం ఎక్క‌డైనా వుందా? లేదా? అని అడిగారు. మ‌న‌దేశానికి కొత్త కావ‌చ్చు కానీ, ఇది 1858వ సంవ‌త్స‌రంలోనే ఆస్ట్రేలియాలో ఉంది. ఆ త‌ర్వాత చాలా దేశాలు అమ‌లు చేశాయి. మ‌న‌దేశంలో కూడా 2016లో రాజ‌స్థాన్‌లో దాదాపు ఇదే చ‌ట్టం పాస్ చేశారు. ఇంకా అమ‌ల్లోకి పోయిన‌ట్టు లేదు. ఆశ‌యాలు మాత్రం చాలా గొప్ప‌వి. ఆచ‌ర‌ణ‌లో ఈ ప్ర‌భుత్వ‌మే కాదు, ఏ ప్ర‌భుత్వ‌మైనా చాలా స‌మ‌స్య‌ల‌తో కూడుకున్న‌ది. అనేక చిక్కులు తొల‌గించే ముందు ప్ర‌భుత్వానికి చాలా స‌మ‌యం కూడా ప‌డుతుంది. కానీ దిన్ని సానుకూల దృక్ప‌థంతోనే చూడాలి. రెండేళ్లా, ఐదేళ్లు ప‌డుతుందా అని చెప్ప‌లేం కానీ, ఒక పాజిటివ్ బిల్లు "

చ‌ట్ట‌స‌భ‌లో ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌సంగం వెలుగు చూడ‌డంతో టీడీపీని ఛీత్క‌రించుకునే ప‌రిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి, రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌ల‌కు టీడీపీ తెర‌లేపింద‌ని ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌సంగం ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ఎల్లో మీడియా అల్ల‌రి, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో, చ‌ట్ట‌స‌భ‌లో మ‌ద్ద‌తు ప‌లుకుతూ చేసిన ప్ర‌సంగంపై ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. టీడీపీ ద్వంద్వ విధానాలు ప్ర‌తి సంద‌ర్భంలో బ‌య‌ట పడుతున్నాయి. తాజాగా టీడీపీ అడ్డంగా దొరికి పోవ‌డంతో వైసీపీకి ఆయుధం దొరికిన‌ట్టైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?