Advertisement

Advertisement


Home > Politics - Andhra

అనకాపల్లి కూటమిలో ఏమి జరుగుతోంది?

అనకాపల్లి కూటమిలో ఏమి జరుగుతోంది?

అనకాపల్లి ఎంపీ సీటుకు కూటమి అభ్యర్ధిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన కడప వాసిగా ఉన్నారు. ఆయన ఈ ప్రాంతానికే కొత్త. ఇక బీజేపీ అనకాపల్లిలో ఎపుడూ ఎక్కడా గెలిచింది లేదు. ఈ రెండు వింతలను మిక్స్ చేస్తూ కూటమి కొత్త వంటకం గా ఈసారి ఎన్నికల్లో జనం ముందుకు తెచ్చింది. దీనికి ప్రయోగంగా కూడా చూసే వారు ఉన్నారు.

సీఎం రమేష్ అభ్యర్ధి అనగానే గెలిచేస్తారు అన్న ఊపుని మొదట్లో తెచ్చారు. సీఎం రమేష్ కి అనకాపల్లి అంతా స్వాగతం పలికేలా తొలి వెల్ కం గ్రాండ్ లెవెల్ లో చేశారు. ఇక అక్కడ నుంచి కధ ఎన్నో మలుపులు తిరుగుతోంది. సీఎం రమేష్ పేరు ప్రకటించడంతో గెలుపు అన్న వారు ఇపుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మాడుగులలోని దేవరాపల్లిలో ఉన్న బూడి ముత్యాలనాయుడు ఇంటి మీద డ్రోన్ ఎగరవేశారని ఆ తరువాత కొందరు వచ్చి రెక్కీ కూడా నిర్వహించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ నాయకుడి ఇంటి మీద డ్రోన్ ఎగరడంతో దానిని వైసీపీ నేతలు ద్వంసం చేశారు. పైగా వైసీపీ ఎంపీ అభ్యర్ధి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు విషయంలో కూటమి కార్యకర్తలు రెచ్చగొట్టినట్లుగా వ్యవహరించారని వారు ఆగ్రహించారు.

ఇదిలా ఉంటే తమ కార్యకర్తలను కొట్టారని టీడీపీ కూటమి అభ్యర్ధి సీఎం రమేష్ నేరుగా బూడి సొంత ఊరు వెళ్ళడం అక్కడ నానా యాగీ చేయడం జరిగిపోయాయని చెబుతున్నారు. ఆ మీదట అటూ ఇంటూ ఉద్రిక్తంగా ఉన్న నేపధ్యంలో సీఎం రమేష్ తన మీద దాడి చేశారు అని ఆరోపణలు చేశారు. తన చొక్కా చించారు అంటూ ఆయన అలాగే పోలీస్ స్టేషన్ కి రావడం బూడి మీద ఫిర్యాదు చేయడం ఇదంతా ఓటమితో వైసీపీ చేయించిన దాడి అని సీఎం రమేష్ ఆరోపించడం గమనార్హం.

దీని మీద వైసీపీ నేతల వెర్షన్ ఎంటి అంటే అసలు తమ నాయకుడి ఇంటి మీద డ్రోన్ ఎగరేసింది ఎవరు రెక్కీ నిర్వహించింది ఎవరు సీఎం రమేష్ మనుషులు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతో ఏదో రకంగా సానుభూతి కోసం సీఎం రమేష్ చేస్తున్న ఎత్తుగడ ఇదంతా అని వారు అంటున్నారు. మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ పోలింగ్ కి దగ్గర పడుతున్న వేళ తన మీద దాడి వైసీపీ చేసింది అని అంటున్నారు.

బూడి ఇంటికి ఎందుకు కూటమి కార్యకర్తలు వెళ్లారు అన్నది తెలియడం లేదు. దీనిని బట్టి చూస్తే అసలు కూటమిలో ఏమి జరుగుతోంది గెలుపు ఆశలు సన్నగిల్లాయా లేక ఈ రకమైన ఎత్తుగడలతోనే పోలింగ్ దాకా సాగుతారా అన్నది చూడాలని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?