అన్నీ ‘పవన’ వార్తలేనట

పవనం అంటూ గాలి. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వార్తలు అన్నీ గాలి వార్తలే అని వాపోతోంది హారిక హాసిని సంస్థ సినిమా యూనిట్. Advertisement తమ సినిమా పేరు దేవుడే దిగివస్తే అంటున్నారని,…

పవనం అంటూ గాలి. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వార్తలు అన్నీ గాలి వార్తలే అని వాపోతోంది హారిక హాసిని సంస్థ సినిమా యూనిట్.

తమ సినిమా పేరు దేవుడే దిగివస్తే అంటున్నారని, అది ఏ మాత్రం కానే కాదని, పేరు డిసైడ్ చేయలేదని, అసలు ఆ పేరు డిస్కషన్ లోనే లేదని అంటున్నారు హారిక హాసిని జనాలు.

అలాగే తమ సినిమాలో సమంత హీరోయిన్ అంటున్నారని, అది కూడా డిస్కషన్ లో కూడా లేదని చెబుతున్నారు. ఇవన్నీ పూర్తిగా ఊహించి రాస్తున్నవని, అసలు తమ డైరక్టర్ త్రివిక్రమ్ ఆలోచనల్లో ఆ విషయాలు లేనే లేవని, ఆయన కేవలం స్క్రిప్ట్ మీదే కీలకంగా వున్నారని అంటున్నారు.

పేరు కానీ, హీరోయిన్ కానీ అస్సలు ఇంకా డిస్కషనే స్టార్ట్ కాలేదంటున్నారు. వాళ్లన్నది నిజమే కావచ్చు. కానీ త్వరగా డిసైడ్ చేసేస్తే, ఈ గ్యాసిప్ లు రావేమో?