Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ సినిమా పూజ అందుకోసమేనట

పవన్ సినిమా పూజ అందుకోసమేనట

నవంబర్ 5న పవన్-త్రివిక్రమ్-హారిక హాసిని కాంబినేషన్ లోని సినిమాకు పూజ. అయితే ఇప్పటికి వరకు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పెద్దగా ఏమీ జరగలేదు. త్రివిక్రమ్ చాలా బిజీగా, వీలయినంత వరకు ఎవర్నీ కలవకుండా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నారు. పవన్ నవంబర్ సెకండ్ వీక్ తరువాత 15 రోజులు కేటాయించి వుంచారు ఈ సినిమాకి. లేదూ అంటే డిసెంబర్ ఫస్ట్ 15డేస్ తీసుకోమన్నారు. హారిక హాసిని ఈ రెండో ఆప్షన్ నే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మరి ఇప్పుడు ఎందుకు పూజ? ముహుర్తం కోసమా అంటే కాదట. ఇండస్ట్రీలో పవన్-త్రివిక్రమ్ మధ్య తేడా వచ్చింది..ఆ సినిమా వుండదు, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా వుంటుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కు పవన్ కు మధ్య సమ్ థింగ్..సమ్ థింగ్ అనే వార్తలు బాగా పుట్టించాలని ఎవరో పని గట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే వాటికి చెక్ పెట్టేందుకు పూజ చేసేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. ఆ మేరకు ఆయన ఆధ్యాత్మిక గురువు ఈ ముహుర్తం నిర్ణయించారట. 

చిత్రమేమిటంటే, ఇటీవల పవన్-ఎఎమ్ రత్నం సినిమా పూజ కూడా ఇలాగే జరిగింది. ఎఎమ్ రత్నం-పవన్ సినిమా ఇప్పుడప్పుడే కాదు. కానీ ఎ ఎమ్ రత్నం కు వున్న ఆబ్లిగేషన్లతో, పూజ చేయాల్సిందే అని పట్టుపట్టడంతో పవన్ కాదనలేకపోయారు. పూజ జరిగిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?