మహేష్-మురగదాస్ సినిమా సంచలనాలకు తెర తీయడం ప్రారంభమైంది. ఈ సినిమా బడ్జెట్ నే ఓ సంచలనం. బాహుబలి పార్ట్ వన్ బడ్జెట్ 120 కోట్లు. అందులో పార్ట్ 2 వ్యవహారం కూడా కొంత వుంది. మహేష్ సినిమా బడ్జెట్ 125 కోట్ల వరకు అవుతోంది. అయితే ఈ సినిమా సేల్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. తెలుగు తమిళ వెర్షన్లు, హిందీ డబ్బింగ్ కు కలిపి మంచి ఆఫర్లే వున్నాయని వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. అయినా ఇంకా బుకింగ్ అయితే ఓపెన్ చేయలేదు.
తొలిసారిగా శాటిలైట్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. జీ సినిమాతో మంతనాలు సాగుతున్నాయి. తెలుగు వెర్షన్ కు 16 కోట్లు, అదర్ వెర్షన్లు అన్నీనో, లేదా కేవలం హిందీనో 10 కోట్ల మేరకు దాదాపు బేరం సెటిల్ అయినట్లే. మూడున్నర కోట్ల వరకు సర్వీస్ టాక్స్ తిరిగి చెల్లింపు దీనికి అదనం. అయితే ఈ మొత్తాలు కేవలం శాటిలైట్ రైట్స్ వరకే కాదు, అడియో రైట్స్ కూడా వాటిలోనే కలిపేసారు. అంటే బాహుబలి కన్నా ఎక్కువ అన్నమాట.
ఒకటి రెండు రోజుల్లో ఇది ఫైనల్ అవుతుంది. దీని తరువాత ఓవర్ సీస్ ఫైనల్ చేసే ఆలోచనలో వున్నారు. దానికి కూడా అన్ని వెర్షన్లు కలిసి 20 కోట్ల వరకు ప్రస్తుతానికి ఆఫర్లు వున్నాయి. అంటే శాటిలైట్, ఓవర్ సీస్ కలిపే 50 కోట్ల వరకు రిటర్న్ వచ్చేస్తుందన్నమాట.