కాంటెపరరీ ఇష్కూలను టచ్ చేయడం అంటే దర్శకుడు పూరి జగన్నాధ్ కు చాలా ఇష్టం. గతంలో ఇలా రెండుమూడు సినిమాలు చేసాడాయన. మళ్లీ ఇప్పుడు మరో ప్రయత్నంగా ఇజమ్ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య బయటపడిన పనామా పేపర్స్, బోగస్ కంపెనీలు, ఇలాంటి వాటి నేపథ్యంలో కథ రాసుకుని, ఓ జర్నలిస్ట్ ఇండియా నుంచి బయల్దేరి మూలాల్లోకి వెళ్లి శొధించినట్లు సినిమా తయారుచేసారు. అదే ఇజమ్.
ఇజమ్ సెన్సార్ నిన్న పూర్తయింది. అన్ని సినిమాల మాదిరిగానే షరా మామూలుగా యు/ఎ వచ్చింది. సినిమా క్లయిమాక్స్ లో టెంపర్ మాదిరిగానే 20 నిమషాల కోర్టు సీన్ వుంటుంది. అది చాలా బాగా వచ్చిందని సెన్సార్ టాక్. కేవలం సిక్స్ ప్యాక్ మాత్రమే కాకుండా, ఈ కోర్టు సీన్ ను కూడా కళ్యాణ్ రామ్ బాగా చేసినట్లు చెబుతున్నారు.
పూరి జాగ్రత్త
ఇదిలా వుంటే దర్శకుడు పూరికి ఈ సినిమా మనుటయా..మరణించుటయా అ నే టైపు. ఎందుకంటే ఈ సినిమా హిట్ మీదే ఆయన కెరీర్ ఆధారపడి వుందన్నది వాస్తవం. అందుకే చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఓ సారి పినిష్ చేసాక, మళ్లీ అటు చూడని అలవాటున్న పూరి జగన్నాధ్ ఈ సినిమాను నాలుగు సార్లు చూసి, మళ్లీ మళ్లీ ఎడిట్ చేసాడట. రెండున్నర గంటలకు పైగా వచ్చిన నిడివిని కోసి, కోసి రెండు గంటల ఎనిమిది నిమషాలకు తీసుకువచ్చారు. ఈ జాగ్రత్తల నేపథ్యంలో సినిమా ఎలా వుంటుదో మరి..చూడాలి.