ప్రపంచ శృంగార పురుషుడు.!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ శృంగార పురుషుడిగా కీర్తింపబడుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ శృంగార ప్రియుడు. తరాలు తిన్నా తరగని ఆస్తి, కీర్తి ప్రతిష్టలు.. ఇవన్నీ వున్నాక, శృంగార పురుషుడు…

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ శృంగార పురుషుడిగా కీర్తింపబడుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ శృంగార ప్రియుడు. తరాలు తిన్నా తరగని ఆస్తి, కీర్తి ప్రతిష్టలు.. ఇవన్నీ వున్నాక, శృంగార పురుషుడు కూడా అయితే ఆ కిక్కే వేరప్పా. ఇది తప్పా.? ఒప్పా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, లైఫ్‌ని ఆయన ఎంజాయ్‌ చేసిన తీరు, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

మామూలుగా అయితే, ట్రంప్‌ ఏం చేసినా అది ఆయన వ్యక్తిగతం. కానీ, ఇప్పుడాయన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో వున్నారు. అందుకే, గతంలో సాధించిన శృంగార కార్యకలాపాలకు సంబంధించి ఆయనిప్పుడు వివాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితేనేం, ఇంతకుముందెన్నడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇంత 'హాట్‌'గా జరగలేదు. పైగా, ఓ మహిళతో పోటీ పడ్తున్న సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఇలా శృంగార సామ్రాజ్యానికి అధిపతి.. అనే ట్యాగ్‌లైన్‌ దక్కించుకోవడం విశేషమే మరి. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుస్తాడా.? లేదా.? అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే ట్రంప్‌.. శృంగార పురుషుడిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చేసుకున్నాడు. గతంలో ట్రంప్‌ సాగించిన శృంగార లీలలకు సంబంధించి ఒక్కో విషయం వెలుగు చూస్తోంది. ట్రంప్‌ మమ్మల్ని ఎక్కడెక్కడో తాకాడు.. మాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. అంటూ కుప్పలు తెప్పలుగా మహిళలు మీడియా ముందుకొస్తున్నారు. ట్రంప్‌ ప్రత్యర్థి హిల్లరీ మద్దతుదారుల పనే ఇదంతా. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. 

అధ్యక్షుడిగా గెలిచి అమెరికాని ఉద్ధరిస్తాడా.? లేదా.? ప్రపంచ రాజకీయాలపై ఆయనకున్న అవగాహన ఏంటి.? ప్రపంచ దేశాలతో అగ్రదేశం అమెరికా ఇంకెంత గొప్పగా సంబందాలు కొనసాగించాలి.? అనే అంశాలకన్నా, ఇప్పుడు శృంగార పురుషుడి రాసలీలలపైనే అమెరికాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రత్యేకం.. అనుకున్నారంతా. కానీ, అమెరికా ఇందుకు మినహాయింపేమీ కాదు. పైగా, ట్రంప్‌ శృంగారపురుషుడా.? కాదా.? అన్న విషయమ్మీదే అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయా.? అన్న అనుమానం కలుగుతోందిప్పుడు. వాట్‌ ఏ పిటీ.!