Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌తో కోన.. కొత్త ప్రయత్నాలు.!

పవన్‌తో కోన.. కొత్త ప్రయత్నాలు.!

పవన్‌కళ్యాణ్‌ సినిమాకి దర్శకత్వం వహించాలనే కోరిక కోన వెంకట్‌లో ఎప్పటినుంచో వుంది. దర్శకుడిగా పవన్‌కళ్యాణ్‌తోనే తన తొలి సినిమా వుంటుందని కోన వెంకట్‌ అప్పట్లో ప్రచారం చేసుకున్న మాట విషయం. రచయితగా కోన వెంకట్‌ అంటే పవన్‌కళ్యాణ్‌కి కూడా అభిమానమే. కానీ, పవన్‌కళ్యాణ్‌ సినిమాకి దర్శకత్వం వహించడమంటే మాటలు కాదు కదా, పవన్‌ని ఒప్పించడమే బిగ్‌ టాస్క్‌ మరి.! 

ఇక, 'దర్శకత్వం గురించిన ఆలోచనల్ని పక్కన పెట్టేశా..' అని ఇటీవలే ప్రకటించిన కోన వెంకట్‌, పవన్‌తో సినిమా చేయడానికైతే ప్రయత్నాలు మానలేదు. దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. ఆ సినిమాకి కథ తానే అందించాలనే ఆలోచనతో వున్నాడట కోన వెంకట్‌. ఈ విషయమై ఇప్పటికే దాసరిని కలిసి కథలు కూడా విన్పించినట్లు తెలుస్తోంది. ఛాన్సిస్తే దర్శకుడిగా కూడా సత్తా చాటుకుంటానని దాసరికి కోన విజ్ఞప్తి చేశాడట. 

అంతిమంగా ఈ విషయంలో డెసిషన్‌ పవన్‌కళ్యాణ్‌దే కదా. దాసరి నారాయణరావు నిర్మాతగా సినిమా చేయడానికి అంగీకరించినప్పటికీ, పవన్‌ ఈ సినిమాకి డేట్స్‌ ఇచ్చే విషయంలో తటపటాయిస్తున్నాడు. రచయితగా కోన వెంకట్‌కి, పవన్‌తో వున్న పరిచయం నేపథ్యంలో ఈ కాంబినేషన్‌ని కోన ముందుకు తీసుకెళ్తాడేమో వేచి చూడాలి. దర్శకుడిగా ఛాన్స్‌ రాకపోయినా, రచయితగా మాంఛి మాస్‌ మసాలా సినిమాని పవన్‌కోసం రెడీ చేయాలనే ఆలోచనతో వున్న కోన వెంకట్‌కి, ఆ కోరిక తీరుతుందో లేదో మరి.! 

రచయితగానే పనిచేసినా, సినిమాపై పెత్తనం చాలావరకు తనదేనన్నట్లుగా వ్యవహరిస్తుండే కోన వెంకట్‌, పవన్‌ సినిమాతోనూ అలాంటి హడావిడి చేసే అవకాశముందా.? అసలు పవన్‌ కోన వెంకట్‌ చేస్తున్న ప్రయత్నాల పట్ల సానుకూలంగా స్పందిస్తాడా.? అన్నిటికీ మించి, దాసరి నిర్మాణంలో పవన్‌ సినిమా వుంటుందా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?