వింత రధం…అసని వరం

ఒక వైపు అసని తుపాను తాకిడికి జనాలు చిగురుటాకుల్లా అల్లల్లాడిపోతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఎపుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.   Advertisement ఇదిలా ఉంటే అసని తుపాను కాదు కానీ ఒక…

ఒక వైపు అసని తుపాను తాకిడికి జనాలు చిగురుటాకుల్లా అల్లల్లాడిపోతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఎపుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.  

ఇదిలా ఉంటే అసని తుపాను కాదు కానీ ఒక వింత అయితే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భారీగా సముద్ర కెరటాలు ఉప్పొంగుతూ తీరం మీదకు దూసుకొస్తున్న వేళ ఆ కెరటాలతో పాటే ఒక వింత రధాన్ని కూడా ఒడ్డుకు చేర్చాయి.

ఇది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. బంగారు రంగులో ఉన్న ఈ రధాన్ని చూసి స్థానికులు మొదట భయపడ్డారు. ఏదో పెద్ద వస్తువేదో తమ తీరానికి వస్తోందని కంగారు పడ్డారు. అయితే తరువాత అది ఒక మందిరం లాంటిదని భావించి స్థానికులు తాళ్ళ సాయంతో ఒడ్డుకు తెచ్చారు.

ఈ రధం మీద 2022 జనవరి 16 అని విదేశీ భాషలో రాసి ఉంది. అలా ఇది విదేశీరధం అని చెబుతున్నారు. అయితే ఎక్కడికి, ఎలా కొట్టుకువచ్చింది అన్నది తెలియదు. అయితే మలేషియా థాయిలాండ్ లేక జపాన్ కి చెందిన రధం అయి ఉండవచ్చునని మెరైన్ పోలీసులు భావిస్తున్నారు. 

మొత్తానికి వింత రధం మాత్రం ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.