తమ సెక్సువల్ రిలేషన్ షిప్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడటం బాలీవుడ్ సెలబ్రిటీల్లో సహజంగా మారింది. టాక్ షో ల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ వారు ఈ ప్రస్తావనలు వచ్చినప్పుడు వెనుకాడటం లేదసలు. ఈ వ్యవహారం ఇప్పుడు రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ సందర్భాల్లో తాము స్పందించిన తీరు గురించి కూడా వారు స్పందించేంత వరకూ వచ్చింది.
ఈ క్రమంలో నటుడు రణ్ వీర్ సింగ్ ఎప్పుడో వచ్చిన తన సినిమాలో ప్రస్తుత తన భార్య దీపికా పదుకోన్ తో నటించిన ముద్దు సీన్ లో తమ స్పందనల గురించి చెప్పాడు. వివాహానికి పూర్వమే వీరిది హిట్ పెయిర్. ఈ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఆ క్రమంలోనే వీరు ప్రేమలో పడి, కొన్నేళ్ల ప్రేమ కథ తర్వాత ఒక్కటయ్యారు.
ఇది ఇప్పటి కథ కాదు. కొన్నేళ్ల కిందట వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ లీల సినిమా చిత్రీకరణ సమయానిదట. ఆ సినిమాలో వీరి జంట ఆకట్టుకుంది. సినిమా హిట్ అయ్యింది. ఆ సినిమాలో వీరి మధ్య శృంగార సన్నివేశాలకు కూడా కొదవలేదు. వాటిల్లో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలున్నాయి. వాటి చిత్రీకరణ సందర్భంలో తమ పరిస్థితి గురించి రణ్ వీర్ చెప్పుకొచ్చాడు.
ఆ సీన్లను చిత్రీకరిస్తున్నప్పుడు తాము ఇద్దరం నియంత్రించుకోలేకపోయినట్టుగా రణ్ వీర్ అన్నాడు. అప్పటికే పరస్పరం ఉన్న ప్రేమ ఫలితమో ఏమో కానీ.. ఆ సీన్ల చిత్రీకరణలో తాము జీవించేసినట్టుగా రణ్ వీర్ చెప్పాడు.
ఆ గాఢమైన ముద్దుల సీన్లలో తామిద్దరం మునిగిపోయినట్టుగా, దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా ముద్దు పెట్టుకోవడం ఆపలేకపోయినట్టుగా అప్పట్లో తమ ఇబ్బంది గురించి వివరించాడు. ఎలాగైతేనేం.. ఆ తర్వాత వీరు ప్రేమలో మునిగి తేలారు. ఇప్పుడు వీరి ముద్దులకు కట్ చెప్పే వారు కూడా ఎవ్వరూ ఉండరు!