నానితో రాజమౌళి సినిమా?

నాని రాజమౌళి కాంబినేషన్ అంటే ఈగ సినిమా టక్కున గుర్తుకు వస్తుంది. అప్పటికి అప్ కమింగ్ హీరో కావడం, పైగా రాజమౌళి లాంటి డైరక్టర్ సినిమా కావడంతో నాని ఆ సినిమా చేసాడు కానీ,…

నాని రాజమౌళి కాంబినేషన్ అంటే ఈగ సినిమా టక్కున గుర్తుకు వస్తుంది. అప్పటికి అప్ కమింగ్ హీరో కావడం, పైగా రాజమౌళి లాంటి డైరక్టర్ సినిమా కావడంతో నాని ఆ సినిమా చేసాడు కానీ, మరో హీరో అయితే ఆలోచించేవారేమో? ఎందుకంటే ఆ సినిమాలో హీరో పాత్ర నిడివి చాలా తక్కువ. హీరోయిన్ కు విలన్ కే ప్రాధాన్యత ఎక్కువ. ఆ సినిమా నుంచి రాజమౌళి కి నానికి మధ్య బాండింగ్ పెరిగింది.  

నాని అంటే రాజమౌళి ఫ్యామిలీ అంతటికీ ఓ ప్రత్యేక అభిమానం కూడా. ఆ అభిమానంతోనే కావచ్చు, నాని ఇటీవలి సినిమా మజ్ఞులో రాజమౌళి తన నిజ జీవిత పాత్రలో నటించారు. పైగా సినిమాకు ముందు వెనుక ఆయన కనిపించి, ప్లస్ అయ్యారు. ఇదంతా ఇలా వుంటే బాహుబలి తరువాత ఓ మీడియం రేంజ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించాలన్నది రాజమౌళి ఆలోచనగా టాక్ వినిపిస్తోంది. 

డివివి దానయ్యకు ఓ సినిమా చేయాల్సి వుంది. అది ఈ సినిమానే కావచ్చు. అయితే ఈ సినిమాలో హీరోగా నానిని తీసుకుంటారని, ఆ విధంగా నానితో ఓ పూర్తి సినిమా చేసినట్లు అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు నాని రేంజ్ 20 కోట్ల దగ్గర వుంది. రాజమౌళి కాంబినేషన్ అంటే అది నలభై కోట్లు దాటేస్తుంది.