ఖైదీ 150 లో బ్రహ్మీ ఊర కామెడీ?

చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నెంబర్ 150. తమిళ సినిమా కత్తికి రీమేక్ ఇది. ఈ సినిమాలో నవరసాలు జోడించాలని చిరంజీవి ఆలోచన. తెలుగు జనాల అభిరుచులకు తగినట్లు, చిరంజీవి సినిమా అభిమానులకు ఎలా…

చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నెంబర్ 150. తమిళ సినిమా కత్తికి రీమేక్ ఇది. ఈ సినిమాలో నవరసాలు జోడించాలని చిరంజీవి ఆలోచన. తెలుగు జనాల అభిరుచులకు తగినట్లు, చిరంజీవి సినిమా అభిమానులకు ఎలా వుండాలో అలా వుండేటట్లు కత్తికి మార్పులు చేర్పులు చేసారు. సీనియర్ రైటర్ పరుచూరి గోపాల కృష్ణదే ఇందులో కీలక పాత్ర. 

అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం. సినిమా బాగానే వస్తోంది కానీ, కామెడీ ట్రాక్ మాత్రం కాస్త ఓవర్ డోస్ గా వస్తోందని తెలుస్తోంది. ఇటీవల తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయిన బ్రహ్మానందం ఈ సినిమాలో మరోసారి ఊరమాస్ కామెడీ ట్రాక్ లో నటించారని అంటున్నారు. 

ఈ తరహా కామెడీని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం మానేసారన్నది ఆ కామెడీ ట్రాక్ తెలిసిన వారి మాట. మరి ఎలా వుంటుందో అన్నది ఫైనల్ గా సినిమా విడుదలయ్యాకే తెలిసేది.