ఒంటి చేత్తో ‘గోల్డ్‌’ సాధించేశాడు

అవయవాలన్నీ సక్రమంగా వున్నా, ఎలా బతకాలో తెలియక ఆత్మన్యూననతో బాధపడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న నేటి యువతకి.. పారా ఒలింపిక్స్‌ విజేతలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. 'చచ్చి ఏం సాధిస్తాం.? బతికి సాధించాలి..' అని నిరూపిస్తున్నారు…

అవయవాలన్నీ సక్రమంగా వున్నా, ఎలా బతకాలో తెలియక ఆత్మన్యూననతో బాధపడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న నేటి యువతకి.. పారా ఒలింపిక్స్‌ విజేతలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. 'చచ్చి ఏం సాధిస్తాం.? బతికి సాధించాలి..' అని నిరూపిస్తున్నారు పారా ఒలింపిక్స్‌ విజేతలు. పారా ఒలింపిక్స్‌ అంటే అందరికీ తెల్సిందే.. ప్రత్యేకావసరాలుగల క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాల్ని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ పారా ఒలింపిక్స్‌ ఉద్దేశ్యం. 

సాధారణ ఒలింపిక్స్‌కి ధీటుగా పారా ఒలింపిక్స్‌కి క్రేజ్‌ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మామూలుగా అయితే పారా ఒలింపిక్స్‌కి మన దేశంలో అంతగా గుర్తింపు లేదనే చెప్పాలి. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న క్రీడాకారులకే కోచింగ్‌ సరిగ్గా ఇప్పించలేని దయనీయ స్థితిలో మన పాలకులున్నారు. దయనీయ స్థితి కాదని, నిర్లక్ష్యం. అలాంటిది ప్రత్యేకావసరాలుగల క్రీడాకారులకు శిక్షణ సరిగ్గా ఇప్పిస్తారని ఎలా అనుకోగలం.? 

అయినాసరే, వున్న సౌకర్యాల్నే వినియోగించుకున్నారు.. అవయవాలు సరిగ్గా లేకపోయినా, జీవితంలో ఏదో సాధించాలన్న తపన.. అందరిలోకీ ప్రత్యేకంగా కన్పించాలనే కసి.. అన్నిటికీ మించి, జీవితాన్ని గెలవాలన్న పట్టుదల.. వెరసి, వారిని వెరీ వెరీ స్పెషల్‌గా మార్చేశాయి. మొన్న మరియప్పన్‌, నిన్న దీపా మాలిక్‌, వరుణ్‌ భాటి ఇప్పటికే పారా ఒలింపిక్స్‌లో పతకాలు దక్కించుకోగా, తాజాగా దేవేంద్ర జఝారియా జావెలెన్‌ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. 

ఫొటో చూస్తున్నారు కదా, దేవేంద్ర ఒంటి చేత్తో పతకాన్ని ఎలా సాధించాడో.! హేట్సాఫ్‌ ఒక్కటే సరిపోదు.. ఇలాంటోళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ.!