పాటల పాడుకుంటున్న బాహుబలి

యుద్ధం ముగిసాక ఏముంటుంది? ప్రశాంతతేగా..బాహుబలి ఎంత వీరుడైనా, రొమాన్స్ లో కూడా కింగే కదా? తొలిభాగంలో కొడుకేమో, తమన్నాతో ఆడిపాడేసాడు. ఇప్పుడు మలి భాగంలో తండ్రి కాస్తా, అనుష్కతో స్టెప్పులేస్తున్నాడు. వచ్చే సమ్మర్ రిలీజ్…

యుద్ధం ముగిసాక ఏముంటుంది? ప్రశాంతతేగా..బాహుబలి ఎంత వీరుడైనా, రొమాన్స్ లో కూడా కింగే కదా? తొలిభాగంలో కొడుకేమో, తమన్నాతో ఆడిపాడేసాడు. ఇప్పుడు మలి భాగంలో తండ్రి కాస్తా, అనుష్కతో స్టెప్పులేస్తున్నాడు. వచ్చే సమ్మర్ రిలీజ్ కు రెడీ అయిపోయిన బాహుబలి ముచ్చటే ఇది. 

బాహుబలిలోని కీలక వార్ సీన్ ను ఫినిష్ చేసేసాడు దర్శకుడు రాజమౌళి. ఇక మిగిలింది పాటలే. అందుకే ఇప్పుడు వాటమీద దృష్టి పెట్టాడు. యుద్దం ఫినిష్ చేసిన రామోజీ ఫిల్మ్ సిటీలోనే పాటల చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. పాటల రికార్డింగ్ అంతా అన్న కీరవాణి తన బాధ్యతగా పూర్తి చేసేసారు. తమ్ముడు రాజమౌళి చిత్రీకరణను చిత్రీ పడుతున్నారు. కొంత సెట్, కొంత గ్రీన్ మ్యాట్ ఇలా అన్నమాట. 

అనుష్క ఫిజిక్ మరీ తగ్గిపోలేదు. అలా అని మరీ 'సైజ్ జీరో' టైమ్ లో లేదు. అందుకే ఏ యాంగిల్ లో అయితే బాగుంటుందో, ఆ యాంగిల్స్ మాత్రం చూపిస్తూ, ఏదో మేనేజ్ చేస్తున్నారు. అయినా దానికీ సీజీ వర్క్ తోడు వుంటుందిగా. వరుసగా పాటల పనులు వీలయినంత త్వరగా పూర్తి చేసి, సినిమాను సిజి వర్క్ కు అప్పగించేయాలని దర్శకుడు రాజమౌళి పట్టుదలగా వున్నారు. ఇవీ బాహుబలి అప్ డేట్స్.