పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్ ప్రకటించేసారు. 9న కాకినాడలో సభ అన్నారు. ఆ తరువాత జిల్లాల వారీ ఆందోళనలు అంటున్నారు. మరి డాలీ డైరక్షన్ లో శరద్ మురార్ నిర్మాణంలో సినిమా ఎప్పుడు వుంటుందో? వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాలి.
ప్రేమమ్ సినిమా ముగిసిన తరువాత శృతి హాసన్ ఈ సినిమా సెట్ మీదకు రావాల్సి వుంది. కానీ ఇంతవరకు ఈ సినిమా బిగిన్ కాలేదు. తోమ్మిది వరకు పవన్ ఇక కాకినాడ సభ హడావుడిలో వుంటారు. కనుక సందేహం లేదు. ఆ తరువాత కనీసం ఓ నాలుగు రోజులన్నా విశ్రాంతి కావాలి.
మరి ఆ తరువాత జిల్లా మీటింగ్ లు అంటున్నారు. మరి అవన్నీ ప్లాన్ చేస్తే, ఇక డాలీ సినిమా ఇప్పట్లో సెట్ మీదకు వెళ్తుందా అని అనుమానం. ఈ సినిమాకు పరోక్ష నిర్మాత ఎలాగూ పవన్ అనే వినికిడి. అందువల్ల ఇక ఈ సినిమాను పక్కన పెట్టి, నేరుగా త్రివిక్రమ్ సినిమానే ముందుకు తీసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్వంత నిర్మాత కన్నా, బయట నిర్మాత నెలల తరబడి వేచి వుండడం కష్టం కదా?