యేలేటి-నాగ్ సెట్ అయ్యే వ్యవహారమేనా?

యేలేటి చంద్రశేఖర్ తో నాగ్ క్యాంప్ నుంచి సినిమా అన్న గ్యాసిప్ ఇటీవల తెగ వినిపిస్తోంది. అయితే ఇది సాధ్యమేనా అన్నది అనుమానం.  ఎందుకంటే చంద్రశేఖర్ సినిమాల్లో లాభాలు చేసుకున్న సినిమాలు ఒకటి రెండు…

యేలేటి చంద్రశేఖర్ తో నాగ్ క్యాంప్ నుంచి సినిమా అన్న గ్యాసిప్ ఇటీవల తెగ వినిపిస్తోంది. అయితే ఇది సాధ్యమేనా అన్నది అనుమానం.  ఎందుకంటే చంద్రశేఖర్ సినిమాల్లో లాభాలు చేసుకున్న సినిమాలు ఒకటి రెండు మాత్రమే. అన్నీ పేరుతెచ్చిన సినిమాలే. అదీ కాక ఇప్పుడు మనమంతా సినిమా తరువాత ఇండస్ట్రీ సర్కిళ్లలో విపరీతమైన గ్యాసిప్స్ వినిపిస్తున్నాయి. 

చంద్రశేఖర్ యేలేటి వన్స్ సినిమా ఓకె అయిన తరువాత ఇక నిర్మాత మాట వినరన్న గుసగుస వినిపిస్తోంది. మనమంతా విషయంలో ఇది ప్రూవ్ అయిందని టాక్. యంగ్ పెయిర్ గా కాస్త లీడ్ ఏక్టర్లను పెట్టుకుందామని, అందుకు తగినట్లు ఆ పెయిర్ లైన్ కొద్దిగా మారిస్తే బాగుంటుందని వచ్చిన సూచనలను దర్శకుడు కొట్టి పారేసాడని టాక్. ఇలా చేసి వుంటే సినిమాకు కాస్తయినా కమర్షియల్ లుక్ వచ్చేది.

సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఆర్ట్ డైరక్టర్ తో డైరక్టర్ కు విబేధాలు వచ్చినట్లు వినికిడి. దీంతో సగంలోనే ఆర్ట్ డైరక్టర్ పక్కకు తప్పుకున్నారు. అప్పటికే సెట్ లు అన్నీ వేసేయడంతో, మరో ఆర్ట్ డైరక్టర్ ను పెట్టుకోకుండానే యేలేటి సినిమా నడిపించేసారు. మరి కొన్ని విషయాల్లో కూడా తన సినిమా అంటే ఓ లెవెల్ అని, ఈ రేంజ్ కు మీరు చేయగలరా అని కొందరు స్టాఫ్ ను అడిగినట్లు తెలుస్తోంది. దాంతో వాళ్లు కాస్త ఫీలయినట్లు వినికిడి.

నాగ్ దగ్గర వ్యవహారం ఇలా వుండదు. పక్కాగా డిస్కషన్లు, ఆయనదే ఫైనల్ డెసిషన్ వంటివి వుంటాయి. మరి ఎవరిమాటా వినడు అనే టాక్ వున్న యేలేటి, ఈ ప్రాజెక్టు కోసం నాగ్ మాటకు తల ఒగ్గాల్సి వుంటుంది. అయినా అసలు ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి వెళ్లినపుడు కదా అని మరో టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో ఇలాగే వెంకీ కూడా యేలేటి లైన్ ఒకటి ఓకె చేసారు అన్న టాక్ వినిపించింది. కానీ అది ఇప్పటి వరకు సెట్ కాలేదు. మరి దీని సంగతేమిటో?