బాబు బంగారం సినిమా కు మంచి హైప్ వచ్చింది, మంచి డేట్ దొరికింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు అయిదు రోజులు స్టడీగా వుంది. హయ్యర్స్, అడ్వాన్స్ లు అన్నీ కలుపుకుని 17 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అన్ని ఏరియాలు కాకున్నా, కొన్ని ఏరియాలయినా బ్రేక్ ఈవెన్ కు చేరుకునే సీన్ కనిపించింది.
థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం అన్నది బాగా ప్లస్ అయింది అన్న మాటలు ఎగ్జిబిటర్ సర్కిళ్లలో వినిపించాయి. డైరక్టర్ మారుతి, నిర్మాత వంశీ లక్కీ అనుకున్నారంతా. కానీ బుధవారం నుంచీ తేడా వచ్చేసింది. కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. గురువారం కూడా అదే ట్రెండ్ కనిపించింది. శుక్రవారం రెండు కొత్త సినిమాలు, అది కూడా అదే కామెడీ జోనర్ లో విడుదలవుతున్నాయి. అవి ఎలా వుంటాయన్న సంగతి అలా వుంచితే, ఎఫెక్ట్ కొంతయినా వుంటుంది.
మరి ఈ లెక్కన బంగారం బయర్లు సేఫ్ జోన్ కు చేరుకుంటారా? అన్నది ప్రశ్నగా మారుతోంది. పాతికలక్షల మేరకు షేర్ చేరుకుంటేనే బయ్యర్లు కనీసం ఊపిరి పీల్చుకోవడానికి వీలవుతుంది. కానీ దానికి చాలా దూరంలో వుంది ప్రెజెంట్ సిట్యువేషన్. అయితే ఈ వారం విడుదలయ్యే సినిమాల ఫలితాలు, మళ్లీ నెలాఖరు దాటేవరకు థియేటర్లలోకి సరైన సినిమా రావ పోవడం అన్న ఫ్యాక్టర్లపైనే బంగారం బయ్యర్ల సేఫ్ అన్నది ఆధారపడి వుంటుంది.
చిత్రంగా బంగారం ప్రచారం పైన కూడా యూనిట్ దృష్టి పెట్టడం లేదు. టీవీ పబ్లిసిటీ ఓకె. సక్సెస్ మీట్ చేసేసారు. కనీసం విశాఖ, తిరుపతి లాంటి మేజర్ సెంటర్లకైనా హీరో డైరక్టర్ లాంటి వాళ్లు కదిలితే మరి కాస్త ప్రయోజనం వుంటుంది అని ఎగ్జిబిటర్ సర్కిళ్ల నుంచి సలహాలు వినిపిస్తున్నాయి.