మందు మీద దర్శకుడు

మందు కొట్టడం అన్నది టీ తాగడం అన్నంత కామన్ అయిపోయింది ఇప్పుడు. విపరీతమైన టెన్షన్లతో, స్ట్రెస్ తో వున్నపుడు మందొక్కటే మందురా అనుకోవడం అలవాటైపోయింది.  Advertisement టాలీవుడ్ లో ఓ డైరక్టర్ ఇప్పుడు ఎందుకో…

మందు కొట్టడం అన్నది టీ తాగడం అన్నంత కామన్ అయిపోయింది ఇప్పుడు. విపరీతమైన టెన్షన్లతో, స్ట్రెస్ తో వున్నపుడు మందొక్కటే మందురా అనుకోవడం అలవాటైపోయింది. 

టాలీవుడ్ లో ఓ డైరక్టర్ ఇప్పుడు ఎందుకో మందునే ఎక్కువగా ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా చేసి గ్యాప్ వచ్చేసింది. చేయాల్సిన సినిమా అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఊరిస్తోంది.

దాంతో చేసేది లేక, పెద్దగా పనీ లేక ప్రస్తుతం మందు సిట్టింగ్ ల్లో గట్టిగా కాలక్షేపం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

జ‌స్ట్ వన్ ఆర్ టూ డేస్ క్రితమే తనతో సినిమా చేయాల్సిన నిర్మాత ఇంట్లోనే తెల్లవారుఝమున రెండు గంటలు దాటే వరకు సిట్టింగ్ వేసి మరీ గ్లాస్ మీద గ్లాస్ లాగించేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అలా అని వేరే ఆఫర్లు లేవా అంటే వున్నాయి. వెళ్లాలంటే కుదరదు. చేతిలో వున్న సినిమా అటో ఇటో తేలిపోతే తప్ప వేరే సినిమా మీదకు వెళ్లలేరు. ఈ సినిమా ఏమీ ఏ సంగతీ తేలదు. దాంతో ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లాల్సిందే. 

అలాంటపుడే చక్కగా వేరే కొత్త స్క్రిప్ట్ లు అల్లుకుని, ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలి. అంతే తప్ప నిర్మాత పోస్తున్నారు కదా అని తెల్లార్లూ మందు కొడితే ఆరోగ్యం పాడవుతుంది.