రాజ్ కందుకూరి అంటే నిన్న మొన్నటి వరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇండస్ట్రీలో మాత్రం ఓ చిన్నపాటి ప్రొడ్యూసర్ గా, ఆపద్ధర్మంగా ఫైనాన్స్ ఇచ్చి ఆదుకునే వ్యక్తిగా కొంతమందికి తెలుసు. ఆయన గతంలో దూల/ గోల శీను లాంటి చిన్న సినిమా తీసిన ప్రొడ్యూసర్ గా చాలా మంది మర్చేపోయారు.
అలాంటిది ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి సక్సెస్ తో ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా వచ్చేసింది. కొత్త దర్శకులు కథలు పట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. సురేష్ బాబు లాంటి నిర్మాత, 'మనం కలిసి మరో సినిమా చేద్దాం' అని ఆఫర్ ఇచ్చేసారు. రాజ్ ది విశాఖ. ఇంతకు ముందు విశాఖ వెళ్తే తన సర్కిల్ లో జనాలతోనే కాస్త హడావుడి. నిన్నటికి నిన్న విశాఖ వెళ్తే జనం సెల్ఫీలు, ఫోటో షూట్లు అనేసరికి, విజయం తెచ్చే కిక్ ఈ రేంజ్ లో వుంటుందా అనిపించిందట.
ఈ ఫేమ్ ను ఇలాగే పదిలంగా వుంచుకోవడానికి ఇకపై ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే సినిమాలు మాత్రమే తీస్తా అంటున్నారు రాజ్ కందుకూరు. మంచి సినిమాలు మాత్రమే తీస్తానని అనుకోవడం,మంచి డెసిషనే. కానీ గతంలో కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసి రాని బాకీలు కిందా రాసుకున్నారు. ఇక అలాంటి వ్యవహారాలకు కూడా స్వస్తి చెబుతూ డెసిషన్ తీసుకోవడం మంచిదేమో?