దటీజ్ క్రిష్

దర్శకుడు క్రిష్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. ఇటు మారుతున్న సామాజిక చైతన్యాన్ని వంట పట్టించుకుంటూ వుంటారు. మరో పక్క మన తెలుగు సాంప్రదాయాలను విస్మరించరు. క్రిష్ తో వ్యక్తిగత పరిచయం వున్నవారందరీ…

దర్శకుడు క్రిష్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. ఇటు మారుతున్న సామాజిక చైతన్యాన్ని వంట పట్టించుకుంటూ వుంటారు. మరో పక్క మన తెలుగు సాంప్రదాయాలను విస్మరించరు. క్రిష్ తో వ్యక్తిగత పరిచయం వున్నవారందరీ ఈ సంగతి బాగా తెలుసు. కాస్త లేటుగా చేసుకుంటున్నా కూడా తన పెళ్లిని కూడా అందరికీ గర్తు వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు క్రిష్. 

సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు అంటే శుభలేఖల దగ్గరే ప్రారంభమవుతాయి. భారీ హడావుడి చేసి వేలకు వేలు ఒక్క కార్డుకే ఖర్చు చేస్తారు. కానీ అందులో ఆప్యాయతా వుండదు మరేం వుండదు. కానీ క్రిష్ జస్ట్ ఓ లేఖ ఫామ్ లో డిజైన్ చేసి, తన చేతి రాతతో అందించేవారి పేర్లు రాసి మరీ పంపింస్తున్నారు.  ఆ లేఖ కూడా ఆకట్టుకునే విధంగా రాసారు. 

అదేవిధంగా ఇండస్ట్రీలో అతి కొద్దిమందికి ఫోన్ లు చేసి, మిగిలిన వారికి కార్డులు మాత్రం పంపిస్తారు అందరూ. కానీ క్రిష్ పేరు పేరునా రోజువారి ఇంతమందికి అని ఫోన్ లు చేస్తూనే వున్నారట గడచిన వారం రోజులుగా. ఇలా ఫోన్ అందుకున్నవారిలో సినిమా పెద్దలే కాదు, సినిమా రంగానికి చెందిన అన్ని క్రాఫ్ట్ ల వారు వుండడం విశేషం. పైగా ఫోన్ చేసి రావాలని చెప్పడం కాకుండా, 'మీరు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి' అని కోరడం క్రిష్ కే చెల్లింది. ఈ ఆదివారం రాత్రి క్రిష్ పెళ్లి రమ్యతో జరుతుంది.