బాహుబలి ఫీలర్ల తంటాలు

బాహుబలి 2 కి కూడా ఫస్ట్ పార్ట్ లాగే వీర బజ్ తీసుకురావాలన్నది ఆ సినిమా యూనిట్ ప్రయత్నం. కానీ కోరి బాహుబలిని నెత్తికి ఎక్కించుకోవడం అన్నది, సెట్ లోకి తొంగి చూసి మరీ…

బాహుబలి 2 కి కూడా ఫస్ట్ పార్ట్ లాగే వీర బజ్ తీసుకురావాలన్నది ఆ సినిమా యూనిట్ ప్రయత్నం. కానీ కోరి బాహుబలిని నెత్తికి ఎక్కించుకోవడం అన్నది, సెట్ లోకి తొంగి చూసి మరీ ఏం జరుగుతుందో రాయడం అన్నదానికి తెలుగు మీడియా కాస్త విరామం ప్రకటించింది. దీనికి తోడు ఫస్ట్ పార్ట్ లో నిర్మాతలకు ఒరిగింది లేదు. బయ్యర్లకు తప్ప. అందువల్ల ఈసారి కనీ వినీ ఎరుగని భయంకరమైన రేట్లు చెబుతున్నారు. దీంతో బయ్యర్లు కిందా మీదా అవుతున్నారు.

ముందుకు వచ్చిన ఓవర్ సీస్ బయ్యర్ వెనక్కు వెళ్లిపోయారని వినికిడి. దీంతో ఇలా లాభం లేదని, తెలుగు మీడియాతో మనకెందుకు అని నేషనల్ మీడియాకు లీకులివ్వడం ప్రారంభించారు. అదే మాయష్మితి రాజ్యం అంటే మళ్లీ ఏం చూస్తాం అనే వాళ్లు కొందరయినా వుంటారు. అందుకే అది కాదు కొత్త రాజ్యం సృష్టించాం అంటూ పాత సెట్ ను చూడని ఏంగిల్ లో కొత్త ఫొటోలు లీకులుగా వదుల్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఈసారి ఎలాగైనా నాలుగు వందల కోట్లకు మార్కెట్ చేయాలి పార్ట్ 2 అని బాహుబలి నిర్మాత-దర్శకుల సంకల్పం. అందుకు తగ్గ బజ్ రేంజ్ వేరు. ఇప్పుడు వచ్చినది వన్ పర్సంట్ కూడా కాదు. బాహుబలి పార్టీ వన్ తో అసోసియేట్ అయిన ఓ బయ్యర్ ను పార్ట్ టూ ఏయే ఏరియాలు కొంటున్నారు? అని ప్రశ్నిస్తే, చూద్దాం..అయినా అంతంత రేట్లు వర్కువుట్ అవుతాయా అన్న అనుమానం వ్యక్తం చేయడం విశేషం. పార్ట్ వన్ అంటే తెలుగులో ఇంతవరకు  ఆ రేంజ్ గ్రాఫిక్స్ చూడలేదు కాబట్టి, నడిచిపోయింది. ఇప్పుడు కేవలం కథ ఏమిటో తెలుసుకోవడానికే చూడాలి అనుకుంటారు చాలా మంది. దానికి సినిమా చూసి వచ్చిన వారిని అడిగినా సరిపోతుంది. 

అందుకే పార్ట్ వన్ ను మించి ఏదో వుంది అన్న దాన్ని జనాల్లోకి పంపాలని తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది బాహుబలి టీమ్.