హీరోలకు పొగ సెగ

టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు పొగ సెగ పెడుతోంది. కానీ ఏం చేయగలరు? అలవాటు అయిపోయిన తరువాత? పెద్ద, చిన్న అని లేదు. చాలా మంది హీరోలు సిగరెట్ కు దాసోహం కావడంతో…

టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు పొగ సెగ పెడుతోంది. కానీ ఏం చేయగలరు? అలవాటు అయిపోయిన తరువాత? పెద్ద, చిన్న అని లేదు. చాలా మంది హీరోలు సిగరెట్ కు దాసోహం కావడంతో వారి వారి ఆరోగ్యాల్లో మార్పులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. కానీ, మానలేకపోతున్నారట. ఎన్టీఆర్, నాని, సునీల్, రాజ్ తరుణ్,రామ్, ప్రభాస్ కొద్దిగానో, ఎక్కువగానో  సిగరెట్ అలవాటు వున్న హీరోల జాబితా పెద్దదే వుందని తెలుస్తోంది. 

ఆ మధ్య ఓ హీరోకి డాక్టర్ మాని తీరాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా మానడం హీరోల వల్ల కావడం లేదు. సినిమా టెన్షన్లు ఈ అలవాటును పెంచుతున్నాయి కానీ తగ్గించలేక పోతున్నాయి. దీంతో ఆరోగ్యంపై ప్రభావం చూపించే ప్రమాదం కనిపిస్తోంది. ఎంత మంది ఈ అలవాటు పెంచుకుంటున్నారో, ఈ అలవాటుకు దూరంగా వున్నవాళ్లు కూడా వున్నారు. 

దాదాపు మెగా హీరోలు ఎవరికీ సిగరెట్ అలవాటు లేనట్లే. అలాగే నిఖిల్ లాంటి యంగ్ హీరోలు కూడా దీనికి దూరంగానే వుంటున్నారు. ఏదైనా లిమిట్ లో వుంటే మంచిదే. లేదూ అంటే ఆరోగ్యం పాడై, అది కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశం వుంది.