చిరంజీవికి ఆంధ్రపై అభిమానం వుందా? వుంటుందా? ఈ విషయమై టాలీవుడ్ లో ఓ కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. నిజంగా ఆంధ్రపై చిరంజీవికి కానీ, మెగా ఫ్యామిలీ హీరోలకు కానీ అభిమానం వుంటే ఒక్క పని చేస్తే చాలు అని టాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి రాజ్యసభకు వెళ్లి గొంతు చించుకోనక్కరలేదు. మెగా ఫ్యామిలీకి అందరికీ కలిసి కొన్ని పదుల ఆదాయపన్ను అక్కౌంట్లు వున్నాయట.
ఇవన్నీ ఇప్పటికీ చాలా వరకు చెన్నయ్ పరిథిలోనే వున్నాయట. ఇందుకోసం చెన్నయ్ లో ఓ ఆఫీస్ నే రన్ చేస్తున్నారట చిరు. దానివల్ల చిరు అండ్ కో కట్టే ఆదాయపు పన్నుఅంతా తమిళనాడు పరిథిలోకే. అందులో వచ్చే రాష్ట్రం వాటా తమిళనాడుకేనట. అందువల్ల చిరుకు నిజంగా ఆంధ్ర మీద ప్రేమ వుంటే ఆయన, ఆయన మెగాక్యాంప్ ఇన్ కమ్ టాక్స్ అక్కౌంట్లు అన్నీ ఆంధ్రకు తరలించాలని, దానివల్ల ఆంధ్ర షేర్ కొంతయినా పెరుగుతుందని, ఇది కూడా ఓ విధంగా సేవే అని సలహాలు వినిపిస్తున్నాయి.
మరి నిజానిజాలు ఇన్ కమ్ టాక్స్ శాఖ, మెగా క్యాంప్ కే తెలియాలి. ఒక వేళ ఇదే నిజమైతే, మెగాక్యాంప్ నుంచి ఆంధ్ర గురించి కేవలం మాటలు తప్ప చేతలు లేవు అనుకోవాలి.