పవన్ సినిమాలు…అంతా అయోమయం

ఏ హీరోతో సినిమా ప్లాన్ చేసినా ఓ పద్దతి..షెడ్యూలు..ప్లానింగ్ అంటూ వుంటాయి. కానీ పవర్ స్టార్ తో సినిమా అంటే అంతా అయోమయం. ఎప్పుడు వుంటుందో తెలియదు. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు.  Advertisement…

ఏ హీరోతో సినిమా ప్లాన్ చేసినా ఓ పద్దతి..షెడ్యూలు..ప్లానింగ్ అంటూ వుంటాయి. కానీ పవర్ స్టార్ తో సినిమా అంటే అంతా అయోమయం. ఎప్పుడు వుంటుందో తెలియదు. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు. 

డే స్టార్ట్ అయ్యే వరకు తెలియదు..క్యాన్సిల్ అనే ఫోన్ వస్తుందో రాదో. ఒక్క రోజు క్యాన్సిల్ అయితే దాదాపు అయిదు లక్షలు వృధా. అదీ కాక కాంబినేషన్ ఆర్టిస్ట్ ల కాల్ షీట్లు వేస్ట్. మళ్లీ వాటిని సెట్ చేసుకోవడానికి కిందా మీదా పడాల్సిందే.

భీమ్లా నాయక్ షూటింగ్ డేస్ ఎన్ని క్యాన్సిల్ అయ్యాయన్నది నిర్మాతకే ఎరుక. అక్కడ మధ్యలో త్రివిక్రమ్ వున్నారు కనుక కొంతలో కొంత ఉపయోగం. ఆ విధంగా ఆ సినిమా బయటకు వచ్చింది. కానీ క్రిష్ సినిమా వరకు వచ్చేసరికి అలా ఎవ్వరూ లేరు. అందుకే ఆ సినిమా డిలే అవుతూ వస్తోంది.

లేటెస్ట్ గా నిన్నటికి నిన్న కూడా షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. సారథి స్టూడియోలో వేసిన సెట్ కు కాలపరిమితి కూడా అయిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వర్క్ ఫినిష్ చేయాల్సి వుంది. 

ఆ సంగతి అలా వుంచితే దసరా నాటికో, సంక్రాంతి నాటికో సినిమాను బయటకు వదలాల్సి వుంది. ఆ పైన హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాల్సి వుంది. ఇవన్నీ ఎప్పటికి జ‌రిగేనో?