తెరపై పరుచుకున్న భావోద్వేగాలు

తెలుగు సినిమా తెరపైకి భావోద్వేగాలు రావడం కొత్త కాదు. కానీ సినిమాలో పార్ట్ గా మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.  అంతే కానీ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాగా రావడం మాత్రం అరుదు. ఎందుకంటే మన…

తెలుగు సినిమా తెరపైకి భావోద్వేగాలు రావడం కొత్త కాదు. కానీ సినిమాలో పార్ట్ గా మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.  అంతే కానీ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాగా రావడం మాత్రం అరుదు. ఎందుకంటే మన సినిమా జనాలకు మాస్ మీద వున్నంత ఆసక్తి మమతానురాగాల మీద వుండదు అనే అనుమానమే. ఈ అనుమానం ఇటీవలే ఎక్కువైంది. గతంలో లేదు. బాలచందర్ ఎన్నో అధ్భుతమైన ఎమోషన్ మూవీస్ అందించారు. 

కానీ ఈ జనరేషన్ లో మాత్రం అవి కాస్త తక్కువే. భయంకరమైన స్టార్ కాస్ట్, కమర్షియల్ వాల్యూస్ జోడించిన మీదటే అలాంటివి ప్రయత్నిస్తున్నారు తప్ప, మీడియం రేంజ్ లో కాదు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చంద్రశేఖర్ యేలేటి ఓ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఎమోషనల్ మూవీ అందించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మనమంతా ట్రయిలర్ చూస్తే ఇదే తెలుస్తోంది. 

నాలుగు పాత్రలు, నాలుగు రకాలు, నాలుగు సమస్యలు, నాలుగు కోరికలు, ఇలా అన్నీ కలిసి ఏ తీరానికి చేరాయన్నది కాన్సెప్ట్ గా అర్థం అవుతోంది. ట్రయిలర్ ఎటువంటి కమర్షియల్ మిక్సింగ్ లు లేకుండా, జస్ట్ స్టోరీని నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. గతంలో క్రిష్ కూడా వేదం సినిమాతో ఇలాంటి ప్రయత్నం చేసారు. అయితే అది యూత్ బేస్డ్ గా వెళ్తే, ఇది మిడిల్ క్లాస్ బేస్డ్ గా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మోహన్ లాల్, గౌతమి ప్రధానపాత్రల్లో కనిపించారు. సాయి కొర్రపాటి నిర్మాత.