కొత్త నిర్మాతలు ఇద్దరు కలిసి 24 కోట్ల మొత్తానికి కబాలి హక్కులు కొన్నారు. అయితే అంతకు ముందు కొచ్చిడియాన్ విషయంలో రజనీ కాంత్ భార్య బకాయి సమస్య తలెత్తింది. ఆ ఇద్దరు కొత్త నిర్మాతలను నానా ఇబ్బందులు పెట్టింది ఈ సమస్య. ఆఖరికి విసిగిపోయిన నిర్మాతలు ఓ టీవీ చానెల్ లో మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో మాఫియా నడుస్తోందని, తాను మూడు పేజీల లేఖ రాసి, మీడియాకు ఇస్తామని చెప్పారు.
మరోసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకూడదనేంత విముఖత వ్యక్తం చేసారు. పేర్లు చెబితే బెదిరిస్తారని, ఫోన్ చేస్తారని కూడా చెప్పారు. అయినా కూడా తాము భయపడమని, అవసరమైతే కెసిఆర్ ను కలుస్తామని, అంటూ, మూడు పేజీల లేఖతో అందరి బండారాలు బయటపెడతామని హెచ్చరించారు.
సరే, రెండు రోజులు గడిచిపోయాయి. సినిమా విడుదలైపోయింది. మరి ఇప్పుడు నిర్మాతలు తమ సమస్యలను మీడియా ముందు బయట పెడతారా? కామ్ గా ఊరుకుంటారా? చానెల్ లో ఆవేదన అంతా కేవలం తాత్కాలికమేనా?