కొడుకు లాంచింగ్ కు సురేష్ సన్నాహాలు

మొత్తానికి తన రెండో కొడుకు అభిరామ్ ను కూడా హీరోను చేయాలని నిర్మాత, స్టూడియో అధినేత దగ్గుబాటి సురేష్ బాబు డిసైడ్ అయిపోయారు. రానా సోదరుడు అభిరామ్ ప్రస్తుతం తండ్రి బాటలో స్టూడియో వ్యవహారాలు…

మొత్తానికి తన రెండో కొడుకు అభిరామ్ ను కూడా హీరోను చేయాలని నిర్మాత, స్టూడియో అధినేత దగ్గుబాటి సురేష్ బాబు డిసైడ్ అయిపోయారు. రానా సోదరుడు అభిరామ్ ప్రస్తుతం తండ్రి బాటలో స్టూడియో వ్యవహారాలు అన్నీ చూసుకుంటున్నారు. అభిరామ్ ను హీరోను చేయడానికి తగిన ప్రాజెక్టు కోసం సురేష్ వెదుతుకున్నారు. 

ఇటీవల సురేష్ కొనుగోలు చేసిన పెళ్లి చూపులు డైరక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ లేదా మరెవరైనా యూత్ ఫుల్ డైరక్టర్ అయితే బాగుంటుందని సురేష్ ఆలోచనగా తెలుస్తోంది. అభిరామ్ ను తమ బ్యానర్ ద్వారా లాంచ్ చేసే అవకాశం ఇవ్వమని నిర్మాత మధుర శ్రీధర్ అడిగినట్లు వార్తలయితే వచ్చాయి. అయితే దీనికి ఇంకా సురేష్ ఓకె అనలేదని తెలుస్తోంది. 

భారీ హడావుడి, భారీ సినిమా లాంటిది కాకుండా, చిన్న సినిమా, అది కూడా యూత్ ఫుల్ కాంటెంపరరీ సబ్జెక్ట్ తో కూడిన  మంచి సినిమా ద్వారా అభిరామ్ ను పరిచయం చేయాలన్నది దగ్గుబాటి సురేష్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుటికే దగ్గుబాటి ఫ్యామిలీలో ఇద్దరు హీరోలున్నారు. ఇప్పుడు అభిరామ్ నెంబర్ మూడు అవుతుంది.