ఆర్ ఆర్ వెంకట్ అనగానే తెలుగు సినిమాలతో పరిచయం వున్నవారికి ఆర్ ఆర్ మూవీస్ బ్యానర్ గుర్తుకువస్తుంది. మంచి సినిమాలు నిర్మించినా, పంపిణీ రంగంలోకి కూడా అడుగు పెట్టి, చాలా నష్టాలు మూటగట్టుకున్నారు. దాంతో సినిమాలు ఆలస్యమై, అవి కాస్తా ఫ్లాపై ఆఖరికి ఆ సంస్థ అలా కనుమరుగైంది.
సినిమా ఇండస్ట్రీలో ఇదేమీ కొత్త విషయం కాదు. చాలా సంస్థలు ఇలా మఖ లో పుట్టి పుబ్బలో మాడిపోయినవే. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఆర్ ఆర్ వెంకట్ మళ్లీ ఇండస్ట్రీలో కాలు పెట్టాలని చూస్తున్నారని వినికిడి. కొందరు ఎన్నారై పార్టనర్ లతో కలిసి, సినిమా నిర్మాణం ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన సినిమా నిర్మాణం ప్రారంభిస్తే, పాత వ్యవహారాలు అన్నీ మళ్లీ బయటకు వస్తాయేమో? లేదా అన్నింటికీ రెడీ అయ్యే దిగుతారా? వెయిట్ అండ్ సీ.