మళ్లీ మొదలైన వాయిదాల పర్వం

టాలీవుడ్ లో మరోసారి వాయిదాల పర్వం మొదలైంది. ఈ దఫా ఒకేసారి 3 సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో, అందరి దృష్టి ఒక్కసారిగా అటు మళ్లింది. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ డెవిల్. Advertisement ఈ…

టాలీవుడ్ లో మరోసారి వాయిదాల పర్వం మొదలైంది. ఈ దఫా ఒకేసారి 3 సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో, అందరి దృష్టి ఒక్కసారిగా అటు మళ్లింది. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ డెవిల్.

ఈ సినిమాని మొద‌ట నవంబరు 24న విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే డెవిల్ ఆ డేట్‌కి రావడం లేదు. దీనికి కారణం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే. డెవిల్ కు భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఉంది. అదింకా కొలిక్కి రాలేదు. అందుకే ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కోసం సినిమాను పోస్ట్ పోన్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

ఈ నెల వాయిదా పడిన మరో సినిమా ఆదికేశవ. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై కూడా పడింది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోతోంది. అందుకే నవంబర్ 10వ విడుదల కావాల్సిన 'ఆదికేశవ'ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేశారు.

ఈ సీజన్ లో వాయిదా పడుతున్న మూడో చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారం అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నాని, నితిన్ సినిమాలు ఆ తేదీకి వచ్చి పడ్డాయి. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా అనివార్యమైంది. దీనిపై హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు కూడా.

అయితే నిర్మాత మాత్రం ఈ విషయాన్ని ఇంకా నిర్థారించలేదు. సినిమా వాయిదా వేయాలనే ఆలోచనలో లేదంటూనే ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందని, పాట బ్యాలెన్స్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇదంతా జరిగి, సినిమా చూసిన తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తామంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 29కి వాయిదా పడింది.