మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి జులై 17, ఆదివారంనాడు అమెరికాలోని అట్లాంటా నగరంలో అభిమానులు మరియు బంధుమిత్రాదుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సోదరుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి తమ అనుభవాలు పంచుకున్నారు.
ఇండియా నుంచి విచ్చేసిన కృష్ణా రెడ్డి గారు (రిటైర్డ్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్), గురివిరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, వైఎస్సార్సీపీ అమెరికా కన్వీనర్ గురవా రెడ్డి, హాజరైన పలు అభిమానులు తెలుగు ప్రజలకు మహానేత చేసిన సేవలను, సేవానిరతిని, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్దను ఉటంకిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పెద్దలు పిల్లలు సమానంగా హాజరయ్యారు, మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం మాహానేత చిత్రపటానికి పూలమాల వేసి పూలు పళ్ళు సమర్పించుకుని దీపారాధనతో మొదలై అజరామరుడైన మహాహానేతను గుర్తుచేసుకుని కార్యక్రమాన్ని మంచి పండుగలాంటి వాతావరణంలో విజయవంతంగా ముగించటం జరిగింది.
బాలా ఇందుర్తి, బలరాం రెడ్డి, శ్రీనివాస్ వంగిమల్ల, భూపాల్, సునీల్, నరేష్ గువ్వా, కల్వకుర్తి ఉమ, దామోదర్, సుధీర్, రామోహన్, రాయుడు, చంద్ర, జగదీష్, విజయ్ కోట, ప్రసాద్ రెడ్డి, వెంకట్ మీసాల, మనోజ్, కిరన్, కృష్న, మహతి, రమణ, లక్ష్మీ చారుగుంట, తదితరులు పాల్గున్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్ రెడ్డి, మరియు వెంకట్రామ్ చింతం హాజరైన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
జోహార్ రాజన్న